Homeఆంధ్రప్రదేశ్‌MLC Anantha Babu: తోటి ఖైదీని కొట్టిన ఎమ్మెల్సీ అనంతబాబు.. జైలులో రాచ మర్యాదలు

MLC Anantha Babu: తోటి ఖైదీని కొట్టిన ఎమ్మెల్సీ అనంతబాబు.. జైలులో రాచ మర్యాదలు

MLC Anantha Babu: జైలుకెళ్లినా ఎమ్మెల్సీ అనంతబాబు తీరు మారడం లేదు. మాజీ డ్రైవర్ హత్య కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ కూడా అనంతబాబు కుదరుగా లేనట్టు తెలుస్తోంది. తోటి ఖైదీపై ఆయన చేయి చేసుకున్నట్టు సమాచారం. చిన్నపాటి వివాదం ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన అనంతబాబు ఖైదీని కొట్టినట్టు సమాచారం. ఖైదీకి చిన్నపాటి గాయమైనా అక్కడ ఆస్పత్రిలో చికిత్స చేయరు. అటువంటి ఓ ఖైదీకి దెబ్బ తగిలినా చికిత్స ఎలా చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు చికిత్స చేసేంత దెబ్బలు తగల్లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబుకు జైలులో సకల సౌకర్యాలు అందుతున్నట్టు తెలుస్తోంది. రిమాండ్ ఖైదీగా చేరిన రెండు రోజులకే ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటుచేశారు. సాధారణంగా ముగ్గురు ఖైదీలకు ఒక గదిని కేటాయిస్తారు. అటువంటిది అనంతబాబు ఒక్కరకే ఒక గది కేటాయించారు. బయట నుంచి ఆయనకు ప్రత్యేక ఆహారం అందుతున్నట్టు సమాచారం. ఆయనకు చక్కగా చూసుకోవాలని జైలు అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకూ ఆదేశాలిస్తున్నట్టు తెలుస్తోంది.

MLC Anantha Babu
MLC Anantha Babu

అధికార నేతల పలకరింపులు..
ఒకవైపు వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటు వేసినట్టు అధిష్టానం ప్రకటించినా.. అధికార పార్టీ నాయకులు తరచూ ఆయనకు జైలుకెళ్లి కలుస్తున్నారు. వాస్తవానికి రిమాండ్ లో ఉన్న ఖైదీని కుటుంబసభ్యులే కలవాలి. నిర్ధేశించిన సమయంలో ఫోన్ లో మాట్లాడే అవకాశముంటుంది. కానీ ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో మాత్రం చాలా మినహాయింపులు ఇస్తున్నట్టు తెలుస్తొంది. జైలుకెళ్లిన తొలినాళ్ల నుంచే తాను లాయర్ నని చెబుతూ ఒక వ్యక్తి తరచూ కలుస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: Jeelugu Kallu: ఏపీలో స్వల్ప ధరకే ఆర్గానిక్ మద్యం.. తాగేటోళ్లకు తాగినంత.. ఎగబడుతున్న జనాలు

రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఒకసారి కలిశారు. ఆ తరువాత కూడా అనధికారికంగా కొందరు వ్యక్తులు కలుస్తునే ఉన్నారు. కలవడానికి వచ్చిన వారు జైలు నుంచి అనంతబాబుతో ఇతరులతో ఫోన్ లో మాట్లాడిస్తున్నారు. అనంతబాబు కేవలం జైలులో ఉన్నారన్న మాట తప్పించి.. తతంగం మొత్తం అక్కడ నుంచే నడిపేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

MLC Anantha Babu
MLC Anantha Babu

ఆందోళనలో దళిత సంఘాలు..
మరోవైపు కేసు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై దళిత సంఘాలు ఆందోళనను, అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసును పారదర్శకంగా విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నాయి. నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ. ఆయనపై హత్యా ఆరోపణలు వచ్చాయన్న నెపంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ దర్యాప్తులో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నిస్తున్నారు. జైలులో ఎమ్మెల్సీ అనంతబాబుకు సకల మర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని.. ఇలాగైతే ఉద్యమ బాట పడతామని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు నేరుగా జైలు నుంచే అన్ని చక్కబెడుతున్నారని.. కేసును నీరుగార్చే ప్రయత్నాలు మొదలు పెట్టారని.. బాధిత కుటుంబానికి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Also Read:Pawan Kalyan- Minister Viswarup: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఆ ఏపీ మంత్రి ఎవరో తెలుసా?
Recommended Videos
ఇద్దరు కౌలు రైతుల ఆవేదన || Nagababu Satires on CM Jagan and Chandrababu || Janasena
పడి పడి నవ్వుకున్న పవన్ || Nagababu Hilarious Comments on Avanthi Srinivas || Janasena Party
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతా.. || Pawan Kalyan Comments on YSR Rythu Bharosa || Ok Telugu

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version