Gully Boy Riyaz Marriage: సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది సెలబ్రిటీలుగా మారారు. తమ ప్రతిభకు పదును పెడుతూ వైవిధ్యమైన విధంగా పోస్టులు పెడుతూ నెట్లో సందడి చేస్తున్నారు. దీంతో అవకాశాలు అందిపుచ్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు సైతం ఉన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలే ఆర్టిస్టులకు ఆయుధాలుగా మారాయి. ఈ నేపథ్యంలో వారిలో దాగి ఉన్న టాలెంట్ ను వెలికి తీసే క్రమంలో పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీంతో ఆర్టిస్టులు తమ అదృష్టాన్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. జీవితమనే చక్రంలో తమకూ ఓ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. చరిత్రలో మనకో పేజీ ఉండాలని కలలు కంటూ వాటిని సాకారం చేసుకుంటున్నారు.
బుల్లితెర కార్యక్రమాల్లో గల్లీ బాయ్స్ ఫేమ్ రియాజ్ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా స్టార్ మా హాస్య కార్యక్రమాల్లో రియాజ్ ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ తానేమిటో నిరూపించుకుంటున్నాడు. యూట్యూబ్ లో కార్యక్రమాలతోనే స్టార్ గా ఎదగడం గమనార్హం. అలాంటి రియాజ్ కామెడీ పండించడంలో దిట్ట. తన పదునైన మాటలతో ఎదుటి వారిని ఇట్టే నవ్వించగలడు. తన చేష్టలతో అందరిని ఆనందంలో ముంచెత్తుతున్నాడు.
Also Read: Major Vs Vikram: మొదటి రోజు కలెక్షన్స్ లో ఎవరిది పై చెయ్యి..?
రియాజ్ వివాహంపై పలు వార్తలు హల్ చల్ చేస్తన్నాయి. గత ఫిబ్రవరిలో రియాజ్ పెళ్లి జరిగిందనే వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఇప్పటివరకు క్లారిటీ మాత్రం లేదు. అయితే ఇటీవల కూడా రియాజ్ పెళ్లి నాటి ఫొటోలను అషురెడ్డి పోస్టు చేసి హ్యాపీ వెడ్డింగ్ డే రియాజ్ అండ్ నజీరా అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఆ ఫొటోలు మరోమారు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రియాజ్ పెళ్లి కొడుకుగా మురిసిపోతున్నాడు. నజీరా కూడా సంతోషంగా ఉండటంతో వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.
రియాజ్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఆయన చిత్రాలంటే రియాజ్ కు ఎంతో ఇష్టం. దీంతో సినిమాల్లో కూడా నటించేందుకు రియాజ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలిసిన వారి దగ్గర ఓ అవకాశం ఇవ్వాలంటూ ప్రాధేయపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వెండితెర మీద కూడా తన ప్రతిబ నిరూపించుకోవాలని భావిస్తున్నాడు .మొత్తానికి రియాజ్ పెళ్లి నాటి ఫొటోలు మాత్రం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. రియాజ్ జీవితంలో పెళ్లి అనే ముఖ్య ఘట్టం గురించి అందరు రకరకాల పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.
Also Read:Pragathi Remunaration: ఒక్కరోజుకు నటి ప్రగతి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?