MLA Roja: ఎమ్మెల్యే రోజా చేసిన ఈ గొప్ప పనికి చప్పట్లు కొట్టకుండా ఉండలేరు..

MLA Roja: చీకటిని చూస్తూ తిట్టుకునే కంటే ఆ చీకటిలో ఓ చిరు దీపం వెలిగించడం మంచిది అనేది చైనా సామెత. వేయి మాటలు చెప్పేకంటే ఒక మంచి పని చేసి చూపడం మేలు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న. సామాజిక సేవా కార్యక్రమాల్లో రోజా ఎప్పుడు ముందే ఉంటారు. కానీ ఈ మధ్య కొంత స్పీడు పెంచారు. వ్యక్తులను, గ్రామాలను దత్తత తీసుకుంటూ తనలోని సామాజిక స్పృహను బయటపెడుతున్నారు. దాతృత్వ భావం ఉంటే […]

Written By: Srinivas, Updated On : December 21, 2021 7:49 pm
Follow us on

MLA Roja: చీకటిని చూస్తూ తిట్టుకునే కంటే ఆ చీకటిలో ఓ చిరు దీపం వెలిగించడం మంచిది అనేది చైనా సామెత. వేయి మాటలు చెప్పేకంటే ఒక మంచి పని చేసి చూపడం మేలు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న. సామాజిక సేవా కార్యక్రమాల్లో రోజా ఎప్పుడు ముందే ఉంటారు. కానీ ఈ మధ్య కొంత స్పీడు పెంచారు. వ్యక్తులను, గ్రామాలను దత్తత తీసుకుంటూ తనలోని సామాజిక స్పృహను బయటపెడుతున్నారు. దాతృత్వ భావం ఉంటే ఏదైనా సాధ్యమే. మానవ సేవే మాధవ సేవ అన్నట్లు ఏదో సాధించామని చెప్పుకునే కంటే పేదవారికి చేయూతనివ్వడంలో కూడా నిజమైన అనుభూతి దాగి ఉంటుంది.

MLA Roja

నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గతంలోనే ఓ నిరుపేద విద్యార్థినిని దత్తత తీసుకుని ఆమె విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పడం గమనార్హం. దీంతో పుష్పకుమారి జీవితం కూడా ఓ నందనవనంగా మారిపోనుంది. రోజా సాయంతో ఆమె మెడిసిన్ చదివేందుకు సిద్ధమైంది. అయినా రోజా మాత్రం ఆమె పూర్తి బాధ్యతను తీసుకుని ఆమెకు ఓ దేవతామూర్తిలా అనిపిస్తోంది.

Also Read: CM Jagan: మద్యపాన నిషేధంపై జగన్ మడమ తిప్పేస్తాడా..?

మరోవైపు ప్రస్తుతం కూడా జగన్ పుట్టిన రోజును మరో విధంగా బహుమతి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. నగరి నియోజకవర్గంలోనే అత్యంత దారుణంగా ఉన్న మీరాసాహెబ్ పాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో మౌలిక సదుాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. వచ్చే జన్మదినం నాటికి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జగనన్నకు కానుకగా ఇస్తానని చెబుతున్నారు. దీంతో రోజాలో దాగి ఉన్న సామాజిక సేవా గుణానికి అందరు ఫిదా అయిపోతున్నారు. సంపద ఎంతున్నా ఏం లాభం దానం చేసే గుణం లేనప్పుడు అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read: TDP Leaders: సొంతగూటికి మాజీ టీడీపీ నేతలు.. ఆసక్తి చూపని బాబు..!

Tags