Star Heroes Upcoming Movies: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోల సినిమాలు విడుదలవ్వక రెండేళ్లు అవుతుంది. 2020 ప్రారంభంలో కరోనా దేశంలోకి ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత వరుసగా లాక్‌డౌన్‌లు విధించడం వలన షూటింగులు అన్ని ఆగిపోయాయి. ఏడాది వరకు కరోనా ప్రభావం ఇండస్ట్రీపై ఉంది. 2021 మధ్యలో కరోనా ఆంక్షలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా సడలించడంతో సినిమా షూటింగులు మళ్లీ పట్టాలెక్కాయి. అయితే, రెండేళ్లుగా ప్రేక్షకుల ముందుకు రాని అగ్రహీరోలు ఈ ఏడాది సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, తారక్, చెర్రీల సినిమాలు షూటింగ్ దశలోనే ఉండటం, మరల కొన్ని అనుకోని కారణాల వలన రేపు మాపు అంటూ ఈ ఏడాది మొత్తం గడిపేశారు.
ఎంతో మురిపించి..
మెగాస్టార్ చిరంజీవి సైరా నర్సింహరెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీలో చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేస్తూ ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 2022లో చిరు వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఇక జూనియర్ ఎన్టీయార్ అండ్ రాం చరణ్ సినిమాలు విడుదవ్వక రెండేళ్లు గడిచిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది డిసెంబర్‌లో వస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచింది. ప్రిన్స్ మహేశ్ బాబు మూవీ రాక కూడా రెండేళ్లు అవుతుంది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారీ పాట’ ఈ ఏడాది రాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తుందనుకుంటే ఏకంగా సమ్మర్‌లో విడుదలకు ప్లాన్ చేశారు మూవీ మేకర్స్.. ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఇవాళ రేపు అంటూ ఈ ఏడాది మొత్తం గడిపేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ‘వకీల్ సాబ్’తో మంచి హిట్ అందుకున్నాడు. ‘భీమ్లా నాయక్’ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
2021లో పవన్, బాలయ్య, వెంకీ, బన్నీ మినహా..
ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్ సినిమాలు మినహా ఎవరి సినిమాలు విడుదల కాలేదు. వెంకీ దృశ్యం-2 థియేటర్స్ ముందుకు రాలేదు. ఓటీటీతోనే సరిపెట్టుకుంది. అక్కినేని నాగార్జున కూడా తన సినిమాలను వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నాగ్ నటించిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త’, ‘ది ఘోస్ట్’ కూడా 2022లో రానున్నాయి.. కానీ ఈ ఏడాది చివర్లో బాలయ్య బాబు ‘అఖండ’తో రోరింగ్ హిట్ అందుకున్నాడు. ఇక బన్నీ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పుష్ప బాక్సాఫీస్ వద్ద తగ్గేదెలే అంటోంది.
Also Read: Chiranjeevi: ప్చ్ ఆయన మాటలు చిరంజీవిని బాధ పెట్టాయి
కరోనా పుణ్యమా అని టాలీవుడ్ అగ్రహీరోల సినిమాలు 2021లో విడుదల కావాల్సినవి ఏకంగా 2022కు వాయిదా పడ్డాయి. కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో అటు RRR, భీమ్లానాయక్ వంటి పవర్ ఫుల్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. ప్రభాస్ మూవీ కూడా లైన్లో ఉండటం, ఆ తర్వాత మహేశ్ బాబు మూవీ రానుండటంతో ఫ్యాన్స్‌కు ఫుల్ పండగే అంటున్నారు సినీ పెద్దలు..
Also Read: Naga Chaitanya: సామ్ దూరమయ్యాక చైతులో ఈ మార్పు మంచిదే !