MLA Chennamaneni Ramesh Babu: మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో వేములవాడ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పేరు కనిపించలేదు.. ఇది అందరూ ఊహించిందే. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాలుగా తన పౌరసత్వానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులకు సంబంధించిన తీర్పులను కోర్టులు పెండింగ్లో పెట్టాయి. ఇది అనివార్యంగా ప్రతిపక్షాలకు వరంగా మారింది. ఈసారి కూడా ఆ సీటును కోల్పోవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. వేములవాడ స్థానంలో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించారు.. అప్పటినుంచి చిన్నమనేని ఒకింత నిర్వేదంలో ఉన్నారు. అసలే సొంతకులపోడు, పైగా అప్పట్లో డబ్బు కూడా సర్దాడు కాబట్టి ఆ నియతితో ఉదరంగా వ్యవహరించాడు.
నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చన్నమనేని రమేష్ కు రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ జీవో ఇష్యూ అయింది. ఆయనకు క్యాబినెట్ ర్యాంకు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రకరకాల సలహాదారులు తెలంగాణ ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. వారిలో ఇప్పుడు చెన్నమనేని రమేష్ కూడా యాడ్ అయ్యాడు. ఈ సలహదారులు ఇటువంటి సలహాలు ఇస్తారు? ఆ సలహాలను కెసిఆర్ పాటిస్తాడా? అనేది పక్కన పెడితే రాజకీయంగా కొంతమందికి ఉపాధి కల్పించేందుకు సలహాదారులు అనే పదవిని ఎరవేయడం తెలంగాణ చేసుకున్న దురదృష్టం. ఈ సలహాదారు ఇప్పుడు ఏం చేస్తారు? జర్మనీ నుంచి తెలంగాణకు రోజూ రాకపోకలు సాగిస్తారా? ప్రభుత్వం ఆయన కోసం ప్రత్యేకంగా విమానాలు నడిపిస్తుందా? ఆయన సలహాలతోనే తెలంగాణ వ్యవసాయం మరింత కొత్త పుంతలు తొక్కుతుందా? ప్రస్తుతం కరువు ఛాయలు ఏర్పడిన తెలంగాణలో వెంటనే వసంతం చిగురిస్తుందా? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి?
జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి, వివిధ కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటూ ఉన్న వ్యక్తిని భారత రాష్ట్ర సమితి పక్కన పెట్టినప్పుడు.. ప్రభుత్వం సలహాదారుగా ఎలా తీసుకుంటుందనేది డిబేటబుల్ ప్రశ్న. ప్రభుత్వ ఖజానా అంటే ముఖ్యమంత్రి ఇష్టం కాదు కదా! చీఫ్ సెక్రటరీగా పనిచేసి పదవి విరమణ చెసినవారు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఆ సలహాలు ఇప్పుడున్న మంత్రివర్గంలో ఎవరికీ తట్టవా? అసలు ఈ సలహాదారుల పదవులు సృష్టించాల్సిన అవసరం ఎక్కడిది? ఈ సలహాదారులు 9 ఏళ్ల పాలన కాలంలో ఎటువంటి సలహాలు ఇచ్చారు? వాటిని ప్రభుత్వం ఎంత మేరకు అమలు చేసింది? ఒకవైపు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్మేస్తుంటే.. తాజాగా ఈ సలహాదారులను నియమించి ప్రభుత్వ ఖజానాలను దోచిపెట్టడం ఎంతవరకు సమంజసం? రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమితులైన చెన్నమనేని రమేష్ తెలంగాణ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాడా? ఇప్పటికే రెండు కోట్ల ఎకరాల మాగాణి ని కెసిఆర్ సృష్టించాడు అని చెబుతున్నప్పుడు చెన్నమనేని రమేష్ కొత్తగా సృష్టించేది ఏమిటి? తెలంగాణ దేశానికి అన్నం పెడుతున్నప్పుడు.. కొత్తగా ఈయన అవసరం దేనికి? మొన్న హనుమంతరావు హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే కేటీఆర్, కవిత రెస్పాండ్ అయ్యారు. అక్కడితోనే ఆగిపోయింది. ఆ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. నిన్న వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన మరో సొంతకులపోడికి పదవి దక్కింది. అంటే దీనిని బట్టి చూసుకోవచ్చు భారత రాష్ట్ర సమితిలో సొంత కులం ప్రజాస్వామ్యం ఏ విధంగా వర్ధిల్లుతోందో! దీనినే దేశం నమూనా కెసిఆర్ చెప్పుకుంటే మాత్రం అంతకుమించిన దరిద్రం ఇంకొకటి ఉండదు.