AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుతో కొరివితో తలగోక్కున్నట్లుగా భావించిన జగన్ క మరో షాక్ ఎదురుకానుంది. ఇప్పటికే డిమాండ్లు పెరుగుతుండటంతో ప్రజల నుంచి వస్తున్న విన్నపాలు తీర్చే క్రమంలో ఎన్నో దారులు వెతుక్కోవాల్సి వస్తోంది. అనంతపూర్ జిల్లా హిందూపూర్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ పెరుగుతుండటంతో అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఆందోళనలో పాల్గొనడం తెలిసిందే. దీంతో సీఎం జగన్ ముందు ఇది కూడా ఓ సవాలు కానుంది. ఈనేపథ్యంలో హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా చేయాలనే దానిపై చర్చ సాగుతోంది. టీడీపీ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చి అక్కడ వైసీపీ జెండా ఎగుర వేయాలని వైసీపీ భావిస్తోంది.
దీని కోసమే కృష్ణా జిల్లా మచిలీపట్నంకు ఎన్టీఆర్ జిల్లాగా పేరుపెట్టి అక్కడ వైసీపీ ప్రభావాన్ని చూపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ విన్నపాలు టీడీపీ నేతల నుంచే రావడంతో అక్కడ వారి కోరికలు తీర్చి వైసీపీకి అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో జగన్ ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వీటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. జగన్ చేసే చర్యలను గమనిస్తూ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: TDP Twitter Account Hacked: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులతో షాకిచ్చిన హ్యాకర్లు
టీడీపీ నేతల నుంచి వస్తున్న డిమాండ్లతో వాటిని నెరవేర్చేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. కుప్పం నుంచి కూడా రెవెన్యూ డివిజన్ చేయాలనే వినతులు ఎక్కువగా రావడంతో సీఎం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు తన నియోజకవర్గాన్ని కనీసం రెవెన్యూ డివిజన్ గా కూడా మార్చుకోలేని నేతగా చూపించేందుకు జగన్ రెడీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టీడీపీ నేతలకు చెక్ పెట్టేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.
దీంతో బాలకృష్ణ చేస్తున్న డిమాండ్ కు జగన్ సై అని హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా చేసి అక్కడ వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇంతవరకు వైసీపీ జెండా ఎగురలేదు. దీంతో ప్రస్తుతం దాన్ని జిల్లా కేంద్రంగా చేస్తూ బాలకృష్ణ అభిమానులకు సైతం కానుకగా అందించనున్నారు. మరోవైపు రెవెన్యూ డివిజన్ కేంద్రాల విషయంలో కూడా ఎక్కువ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ నేతల నుంచే వస్తున్నందున వాటిని నెరవేర్చేందుకే జగన్ మొగ్గు చూస్తున్నారని చెబుతున్నారు. దీంతో టీడీపీ స్థానాల్లో వైసీపీ జెండా రెపరెపలాడేందుకు పరోక్షంగా టీడీపీ వారే సహకరిస్తున్నారా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్