Age Relaxation: ఉద్యోగ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ సడలింపు… కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు..

Age Relaxation: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నో ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేటకు 81 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఇటీవల ప్రకటించారు. ఇక ఈ పోస్టుల భర్తీ విషయంపై బిజీ అయింది టీఎస్‌పీఎస్సీ. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఇక ఇదే టైంలో చాలా మంది నిరుద్యోగుల ఏజ్ బార్ అయిపోయింది. ఈ విషయంపై గతంలో నుంచి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం […]

Written By: Mallesh, Updated On : March 19, 2022 1:51 pm
Follow us on

Age Relaxation: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నో ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేటకు 81 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఇటీవల ప్రకటించారు. ఇక ఈ పోస్టుల భర్తీ విషయంపై బిజీ అయింది టీఎస్‌పీఎస్సీ. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఇక ఇదే టైంలో చాలా మంది నిరుద్యోగుల ఏజ్ బార్ అయిపోయింది.

KCR

ఈ విషయంపై గతంలో నుంచి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటి వారికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా.. ఇతర డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అభ్యర్థుల ఏజ్ లిమిట్‌ను 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సీఎం ప్రకటన కూడా చేశారు. మరో వైపు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సైతం కసరత్తు మొదలుపెట్టింది.

Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?

అన్ని శాఖల నుంచి ఖాళీలకు సంబంధించిన వివరాలను తీసుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఏ క్షణానైనా ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉంది. కానీ వయోపరిమితి పెంపు‌పై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. తర్వలోనే ఈ విషయంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రానున్నట్టు సమాచారం. ఇప్పటికే వయోపరిమితి విషయంలో సవరణలు చేసి ప్రతిపాదనను సిద్ధం చేశారు అధికారులు. వాటిని సీఎం కేసీఆర్ వద్దకు పంపించినట్టు సమాచారం. ఇందుకు సీఎం ఓకే చెప్పిన వెంటనే అది అమల్లోకి రానుంది.

CM KCR

ప్రస్తుతం ఓబీసీలకు 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లు, దివ్యాంగులకు 44 ఏళ్లు వయో పరిమితి‌గా ఉంది. గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచాలని అనుకుంటున్నట్టు సీఎం ఇటీవలే ప్రకటించారు. ఒకవేళ అదే జరిగితే ఓబీసీలకు 44 ఏళ్లు, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు దివ్యాంగులకు 54 ఏళ్లు ఉన్న వారు ప్రభుత్వం ఉద్యోగాలకు అప్లై చేసుకునే చాన్స్ ఉంటుంది. దీని వల్ల సుమారు లక్ష మంది వరకు లబ్ధి పొందనున్నారని టాక్. మరి వయోపరిమితిపై సీఎం కేసీఆర్ ఏం ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ విషయంపైనే నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్

Tags