జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్మోహరెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది దాటిపోతుంది. ఈ ఏడాది పాలనలో జగన్ తనదైన ముద్ర వేశాడన్నది ఒప్పుకోవాల్సిన నిజం. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలలో చాలావరకు ఏడాది లోపే నెరవేర్చే ప్రయత్నం చేశారు. అమ్మవడి, మత్యకార భరోసా, విద్యాదీవెన, వాహన మిత్ర మరియు వసతి దీవెన వంటి అనేక పథకాల అమలు జరిగింది. లబ్ది దారులకు అకౌంట్స్ లో డబ్బులు నేరుగా జమకావడం కూడా పూర్తి అయ్యింది. చైనా ఎత్తులను […]

Written By: Neelambaram, Updated On : June 19, 2020 1:04 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్మోహరెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది దాటిపోతుంది. ఈ ఏడాది పాలనలో జగన్ తనదైన ముద్ర వేశాడన్నది ఒప్పుకోవాల్సిన నిజం. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలలో చాలావరకు ఏడాది లోపే నెరవేర్చే ప్రయత్నం చేశారు. అమ్మవడి, మత్యకార భరోసా, విద్యాదీవెన, వాహన మిత్ర మరియు వసతి దీవెన వంటి అనేక పథకాల అమలు జరిగింది. లబ్ది దారులకు అకౌంట్స్ లో డబ్బులు నేరుగా జమకావడం కూడా పూర్తి అయ్యింది.

చైనా ఎత్తులను చిత్తు చేసేదేలా?

సదరు పథకాల ద్వారా లబ్దిపొందిన ప్రజలు జగన్ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నా.. మిగతా వర్గాలు అసంతృప్తిగా ఉన్నారన్నమాట వినిపిస్తుంది. ఉదాహరణకు వాహన మిత్ర పధకం క్రింద కేవలం ఆటో డ్రైవర్స్ కి మాత్రమే ఏడాది రూ. 10000 లబ్ది చేకూరుతుంది. సొంత ఆటో లేని డ్రైవర్ కి ఈ పథకం వర్తించదు. అలాగే అనేక రకాల రవాణా వాహనాలు నడిపే వ్యవస్థీకృతం కాని చాలా మంది డ్రైవర్లు ఆర్ధికంగా వెనుకబడినవారే. ఇలాంటి డ్రైవర్లు మరి మా సంగతేంటి అని జగన్ ని సూటిగా అడుగుతున్నారు.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైస్సార్ చేయూత పథకం క్రింద ఎస్ సి, ఎస్ టి మరియు బీసీ మహిళల ఖాతాలలో నేరుగా రూ.75000 జమ చేయనున్నారు. ఈ పథకం పట్ల వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నా…ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వారు పెదవి విరుస్తున్నారు. ఆదాయ ప్రాదిపదికన ఈ పథకం అమలు చేయవచ్చు కదా అని వారు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ విధంగా జగన్ అమలుపరుస్తున్న ప్రతి పథకం వలన ప్రయోజనం పొందుతున్న లబ్దిదారులలో జగన్ పై అభిమానం పెరుగుతుంటే, అర్హులు కానివారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?

దీనితో జగన్ అమలు పరిచిన ప్రతి పథకం విషయంలో అనుకూలత మరియు ప్రతికూలత ఏర్పడుతుందట. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇసుక పాలసీ ఇబ్బంది కరంగా ఉంది. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగంలోని కార్మికులు ఉపాధి విషయంలో ఇబ్బందులపాలవుతున్నారు.కొన్ని విషయాలలో ప్రభుత్వం పనితీరు బాగోలేదనే మాట వినిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇన్ని పథకాలు అమలు చేసినా ప్రజల్లో జగన్ పాలనపై మిక్స్డ్ టాక్ ఉందని సమాచారం.