చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్ అగ్ర నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, కన్నడ హీరో చిరంజీవి సర్జా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాల మరచిపోకముందే ఇండస్ట్రీలో మరో వ్యక్తి మృతి చెందాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు, రచయిత ఆర్. సచిదానందన్ కన్నుమూశారు. సాచీగా సుపరిచితుడైన 48 ఏళ్ల ఈ దర్శకుడు కొంతకాలంగా ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ మధ్యే ఆయనకు సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుంటూ ఉండగా మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. దాంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. కానీ, ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి ఆయన మృతి చెందారు.
రోజా, రజినీకి షాక్.. వైసీపీలో ఈసారి ఛాన్స్ ఎవరికి?
సాచీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన దర్శకత్వం వహించిన ‘అయ్యప్పనమ్ కోషియమ్’ ఇటీవలే విడుదలై భారీ విజయం సాధించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మేనన్ నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కేవలం 5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. దాని రీమేక్ రైట్స్ కోసం అన్ని భాషల నిర్మాతలు పోటీ పడుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఇందులో రవితేజ, రానా నటిస్తారని.. సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. కాగా, తొలుత పలు చిత్రాలకు రచయితగా పని చేసిన సాచీ.. 2015లో వచ్చిన ‘అనార్కలి’ దర్శకుడిగా సాచీకి మొదటి సినిమా. ఆయన రెండో సినిమానే ‘అయ్యప్పనమ్ కోషియమ్’. ఆ మూవీ చిత్రీకరణ సమయంలోనే ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొని స్టార్డమ్ తెచ్చుకున్న కొన్ని రోజులకే సాచీ ఈ లోకాన్ని విడిచి వెళ్లపోవడాన్ని పరిశ్రమ వర్గాలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.