https://oktelugu.com/

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన తెలంగాణ మంత్రి!

కరోనా భయంతో లాక్ డౌన్ కారణంగా 55 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఈ రోజు రోడ్లపైకి వచ్చాయి. హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతిండంతో బస్సులు  నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌- హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రయాణించారు. బస్సులో భౌతిక దూరం, శానిటైజర్ల ఏర్పాట్లను   అడిగి తెలుసుకున్నారు.  సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు.  ప్రయాణికులు ఆర్టీసీ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. అంతకుముందు మహబూబ్‌ నగర్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 19, 2020 / 06:53 PM IST
    Follow us on

    కరోనా భయంతో లాక్ డౌన్ కారణంగా 55 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఈ రోజు రోడ్లపైకి వచ్చాయి. హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతిండంతో బస్సులు  నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌- హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రయాణించారు. బస్సులో భౌతిక దూరం, శానిటైజర్ల ఏర్పాట్లను   అడిగి తెలుసుకున్నారు.  సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు.  ప్రయాణికులు ఆర్టీసీ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. అంతకుముందు మహబూబ్‌ నగర్‌ బస్టాండ్‌ ను మంత్రి తనిఖీ చేశారు.