రేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రెషన్స్ దూరంగా ఉంటున్నాడు. దేశంలోని విపత్కర పరిస్థితుల్లో అభిమానులు ఇళ్లలోని ఉండాలని సెలబ్రేషన్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించద్దని కోరారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ సర్ ప్రైజ్ ఉంటుందని అభిమానులు భావించారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ బర్త్ డేకు సర్ ప్రైజ్ ఉంటుందని.. కానీ అదేంటో ఇప్పుడే చెప్పలేనని ప్రకటించడంతో అభిమానులు అత్రుతగా ఎదురుచూశారు. అయితే ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎన్టీఆర్ కు బర్త్ డే గిప్ట్ ఇచ్చే పరిస్థితి లేదని ప్రకటించడం అభిమానులు నిరాశ చెందారు. ఇదిలా ఉండగా తాజాగా ‘బిగ్ బాస్-1 హౌజ్ మేట్స్’ ఎన్టీఆర్ బర్త్ డేకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేయడం ఆసక్తిని రేపుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో రాణిస్తూ బుల్లితెరపై హోస్టింగ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు రియాలిటీ షోలను బిగ్ బాగ్ నిర్వాహకులు పరిచయం చేశారు. బాగ్ బాస్ తొలిసీజన్ ‘బిగ్ బాస్-1’కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘బిగ్ బాస్-3’ కాంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ కోసం కంటెస్టెన్స్ ను ఎంపిక చేస్తోంది. త్వరలోనే ‘బిగ్ బాస్-4’ రాబోతుంది. అయితే ఈ షోకు వాఖ్యతలుగా నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో ఎవరూ బిగ్ బాస్-4 వ్యాఖ్యతగా వ్యవరిస్తారనే త్వరలోనే తేలనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్-1 హౌజ్ మేట్స్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ స్పెషల్ వీడియో ప్లాన్ చేశారు. రేపు ఉదయం 9.30గంటలకు సంగీత దర్శకుడు థమన్ ఈ వీడియోను విడుదల చేయనున్నాడు. దీంతోపాటు దర్శకుడు త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో ప్రారంభం కానున్న మూవీ టైటిల్, ఫస్టు లుక్ విడుదల చేయనున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ప్రకటించాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.