Pawan – Roja : మంత్రి రోజా మరోసారి తన నోటి దూకుడును ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేశారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ఎందుకు పార్టీ పెట్టారో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఒకరోజు సీఎం అవుతానంటారు.. మరోసారి ఎమ్మెల్యే చేయండని ప్రజలను కోరుతారు. అసలు పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే క్లారిటీ లేదన్నారు. వైసీపీ నేతలను తిట్టడం కోసమే పవన్ పార్టీ పెట్టినట్లు ఉందన్నారు. పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజలకు ఏంచేస్తారో చెప్పకుండా తమపై చీప్ కామెంట్లకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు.
చాలా రోజుల తరువాత మంత్రి రోజా వారాహి యాత్రను టార్గెట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ చదువుతున్నారని.. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. వాడుకునే వదిలేసే నైజం చంద్రబాబుదన్నారు. ఈ విషయం చిరంజీవికి తెలుసునన్నారు. 2014లో చంద్రబాబుతో వెళ్లవద్దని చిరంజీవి కోరిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు మాట వినకుండా.. అన్నయ్య చిరంజీవి మాట వినాలని రోజా హితబోధ చేశారు. అనుకున్న పని అయిన తరువాత చంద్రబాబు పవన్ ను విడిచిపెట్టడం ఖాయమన్నారు. పవన్ రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకోవడం ఉత్తమమని చెప్పారు. లేకుంటే రాజకీయాల్లో అబాసుపాలు కావడం ఖాయమని రోజా జోష్యం చెప్పారు. రెండుచోట్ల పరువు పొగొట్టుకోవడం ఖాయమని తేల్చిచెప్పారు.
చంద్రబాబు స్క్రిప్ట్ చదివి అన్నివర్గాల వారికి పవన్ విలన్ గా మారరని రోజా అన్నారు. తనకు ఓటువేసే వారే సభలకు రావాలని పిలుపునిస్తున్నారని.. ప్రజలకు ఇప్పటికే జగన్ మంచి చేశారని.. ఆయన్ను కాకుండా మిమ్మల్ని ఎవరు ఓటువేస్తారని పవన్ ను ప్రశ్నించారు. వైసీపీ నేతలను కొట్టేందుకే పవన్ పార్టీ పెట్టడా అంటూ సెటైర్లు వేశారు. అమ్మవారి పేరు వారాహి యాత్ర అని పెట్టుకొని బూతు పురాణం వల్లె వేస్తున్నారని.. తనకు ఆరోగ్యం బాగాలేదని ట్రోల్ చేస్తున్నారని.. డెవిల్ బ్యాక్ అని గుర్తెరగాలని తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తిరుపతి వేదికగా రోజా జనసేనను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.