Homeఎంటర్టైన్మెంట్Nagarjuna Rejected Varanasi Role: వారణాసి లో నాగార్జున చేయకపోవడానికి కారణం ఇదేనట...

Nagarjuna Rejected Varanasi Role: వారణాసి లో నాగార్జున చేయకపోవడానికి కారణం ఇదేనట…

Nagarjuna Rejected Varanasi Role: రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ లను సాధించాయి. అందువల్లే ప్రతి ఒక్కరు తన సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తూ ఉంటారు… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మూడు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకొని నాలుగో షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు 5 డిఫరెంట్ గెటపుల్లో కనిపించబోతున్నారట. మహేష్ బాబు తో పాటు ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండటం విశేషం… ఈ మూవీలో మొదట నాగార్జున ను విలన్ గా తీసుకోవాలని అనుకున్నాడు. కానీ నాగార్జున మాత్రం ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసుకొని దాన్ని చేయడానికి ఆయన కొంతవరకు ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ వీల్ చైర్ కి పరిమితమవుతాడు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!

కాబట్టి నాగార్జున ఇంతకు ముందే ఊపిరి సినిమాలో వీల్ చైర్ కి పరిమితమయ్యే పాత్రనైతే చేశాడు. కాబట్టి అలాంటి పాత్ర చేస్తే తనను తాను కాపీ చేసుకున్నవాడవుతాడని చెప్పాడట. దాంతో ఈ సినిమాలోకి విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ ఎంట్రీ ఇచ్చాడు. వేరే పాత్ర ఏదైనా ఉంటే చేస్తాను అది మరి రొటీన్ గా అయిపోతుంది అని నాగార్జున చెప్పాడట. దాంతో రాజమౌళి సరేనని చెప్పాడట.

ఇంకేదైనా వేరే క్యారెక్టర్ ఉన్నా లేదంటే వేరే సినిమాలో తనకోసం ఒక మంచి పాత్ర ఉన్నప్పుడు నాగార్జునను సంప్రదిస్తానని జక్కన్న చెప్పినట్టుగా తెలుస్తుంది…అలా నాగార్జున వారణాసి సినిమాను రిజెక్ట్ చేశాడు… ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ సినిమాని దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలైతే చేస్తున్నారు…

అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని నాగార్జున కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా ‘కళ్యాణ్ కృష్ణ’ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2027వ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version