Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు గొర్రెల కాపరి

గతంలో కూడా మంత్రి పలు సందర్భాల్లో తాను చాలా కష్టపడ్డానని చెప్పువారు. అప్పుడు ఓ మహిళ మీరు ఏం చేసి పైకొచ్చారని ప్రశ్నించడంతో మంత్రి చిక్కుల్లో పడ్డారు. అలా ఆయన తన మాటలు, చేతలు విచిత్రంగా ఉంటాయని అందరు చెప్పుకుంటుంటారు. ఇలా ప్రత్యక్షంగా ఆయనో జోకర్ అంటూ జోకులు వేసుకుంటారు. దీంతో మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.

Written By: Srinivas, Updated On : July 6, 2023 5:36 pm

Minister Malla Reddy

Follow us on

Minister Malla Reddy: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి మంచి నటుడు. ఆయన డ్యాన్స్ చేస్తాడు. పాటలు పాడతాడు. జోకులు వేస్తారు. ఏది చేసినా సంచలనమే. ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. తాను ఇంత పెద్ద పొజిషన్ కు రావడానికి చాలా కష్టపడ్డానని అంటుంటారు. పాలు పితికానని చెబుతాడు. అలా ఆయనకు వృత్తులంటే ఎంతో గౌరవం చూపిస్తుంటాడు. అలా ఆయన రోజుకో అవతారం ఎత్తడం మామూలే.

గొర్రెల కాపరి వేషం

ఇందులో భాగంగా ఆయన ఇవాళ గొర్రెల కాపరుల అవతారం ఎత్తాడు. మేడ్చల్ జిల్లా గౌరవెల్లిలో గొర్రెలపెంపకం దారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. అనంతరం వారి గొంగళి కట్టె పట్టుకుని గొర్లు కాశారు. గొర్ల కాపరి అవతారం ఎత్తాడు. గొర్రెలు కాస్తూ హాస్యం పండించారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన చెప్పినట్లే తాను చాలా కష్టపడ్డానని చెబుతూ ఆ పాత్రల్లో జీవిస్తుంటాడు.

గతంలో..

గతంలో కూడా మంత్రి పలు సందర్భాల్లో తాను చాలా కష్టపడ్డానని చెప్పువారు. అప్పుడు ఓ మహిళ మీరు ఏం చేసి పైకొచ్చారని ప్రశ్నించడంతో మంత్రి చిక్కుల్లో పడ్డారు. అలా ఆయన తన మాటలు, చేతలు విచిత్రంగా ఉంటాయని అందరు చెప్పుకుంటుంటారు. ఇలా ప్రత్యక్షంగా ఆయనో జోకర్ అంటూ జోకులు వేసుకుంటారు. దీంతో మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.

వృత్తిదారులకు అండగా..

గొర్రెల కాపరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే యూనిట్లు పంపిణీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం వృత్తిదారులకు ఆసరాగా నిలుస్తుందని చెబుతున్నారు. దీంతో మంత్రి మల్లారెడ్డి చేతలు విచిత్రంగా ఉండటంతో అందరు నవ్వుకుంటున్నారు.