Minister KTR: జూబ్లీహిల్స్ లో బాలికపై గ్యాంగ్ రేప్ సంచలనం సృష్టిస్తోంది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. నిందితులకు అధికార పార్టీ కొమ్ముకాస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో టీఆర్ఎస్ కూడా స్పందించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలికపై రేప్ వ్యవహారంలో ఆయన పెదవి వప్పారు .ఇందులో మైనర్లు ఉండటంతో వారిని జునైవల్ హోంకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నా వారిని పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు చేసిన విన్నపాన్ని కేటీఆర్ సమర్థిస్తున్నారు. వారు మైనర్లయినా బాలిక జీవితాన్ని కకావికలం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారిని మేజర్లుగా పరిగణించాలని పోలీసులు తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే అందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిందితులను విచారిస్తున్నారు. వారు సంచలన విషయాలు వెల్లడించారు. ఒక్కొక్కరు ఎలా చేశారో కూడా వివరించడంతో వారికి శిక్షలు ఖరారే అని తెలుస్తోంది. దీనిపై రేగుతున్న రాజకీయ దుమారం నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టీఆర్ఎస్ పై విమర్శలు వస్తున్న సందర్భంలో మంత్రి మాటలు వింతగా లేకపోయినా అందులోని మర్మమేమిటో తెలియడం లేదు.
Also Read: Attacks On Women: ఆమెకు ఏదీ రక్షణ..
నగరంలో రెండు రేప్ లు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానాలు రావడంతో మంత్రి కేటీఆర్ తమ మీద మచ్చ పడకూడదనే ఉద్దేశంతో నోరు విప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నింద పడకుండా ఉండేందుకు మంత్రి ఇలా మాట్లాడారని చెబుతున్నారు. ఈ రేప్ లో పాల్గొన్న వారిలో ఒకరు తప్ప మిగతా వారందరు మైనర్లే కావడం గమనార్హం. గతంలో ఓ కేసులో మైనర్ ను కూడా మేజర్ గా పరిగణించి జీవితఖైదు విధించడంతో ఇప్పుడు ఈ కేసులో కూడా అలా జరిగితే సంచలనం చోటుచేసుకునే అవకాశం ఉంది.
పోలీసులు చేసిన విన్నపాన్ని కోర్టు ఒప్పుకుంటే నిందితులకు శిక్ష భారీగానే పడే వీలుంది. దీంతో పోలీసుల కోరికను జువైనల్ కోర్టు మన్నిస్తుందా? లేక మైనర్లుగానే గుర్తిస్తుందా అనేది తేలాల్సి ఉంది. కానీ కేటీఆర్ మాత్రం వారిని మేజర్లుగా పరిగణించి పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు. దీంతో ఈ కేసులో వివాదాలు ఎక్కువవుతున్నాయి. మేజర్ అయిన షాబుద్దీన్ ను పోలీసులు విచారిస్తున్నారు. అతడు చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ఒకరి తరువాత ఒకరం రేప్ చేసినట్లు వెల్లడించడం తెలిసిందే. ఈ క్రమంలో కేసు ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు. కేటీఆర్ వ్యాఖ్యలతో కేసులో ఏం మార్పులు జరుగుతాయో వేచి చూడాల్సిందే.
Also Read:BJP- Pawan Kalyan: బీజేపీ, పవన్ కళ్యాణ్.. ఓ సీక్రెట్ భేటి