Rajamouli- Mahesh Babu: ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి తానేమిటో మరోసారి నిరూపించారు. ఆయన రంగంలోకి దిగితే రికార్డ్స్ బద్దలు అని రుజువు చేశారు. ఆర్ ఆర్ ఆర్ తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.దీంతో ఆయన నెక్స్ట్ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ తో రాజమౌళి మూవీ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్రప్రసాద్ మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో నడిచే అడ్వెంచరస్ స్టోరీ రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. దాదాపు ఈ స్టోరీనే మహేష్ కోసం రాజమౌళి ఎంచుకున్నారట. రాజమౌళి గత చిత్రాలకు మించి భారీ స్కేల్ లో మహేష్ ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ నుండి పూర్తిగా బయటపడిన రాజమౌళి మహేష్ మూవీ పనులు మొదలుపెట్టారట. ఈ చిత్ర క్యాస్ట్ పై కసరత్తు చేస్తున్నారట. దీనిలో భాగంగా.. హీరోయిన్ ఎంపిక కూడా జరిగిందని వార్తలు వెలువడుతున్నాయి.
Also Read: Bhavadeeyudu Bhagat Singh: భవదీయుడు భగత్ సింగ్ పై పుకార్లు… చెక్ పెట్టిన హరీష్ శంకర్!
పాన్ ఇండియా చిత్రం కావడంతో హీరోయిన్ ని బాలీవుడ్ నుండి ఎంచుకున్నారట. శ్రద్దా కపూర్ ని మహేష్ కి జంటగా సెలెక్ట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.కాగా మహేష్ హీరోయిన్ ఎంపిక విషయంలో రాజమౌళి తడబడ్డారని అంటున్నారు. శ్రద్దా కపూర్ అసలు మహేష్ కి జోడీ కాదని, మరొకరిని ఎంచుకోవాలని అంటున్నారు. అందులోనూ ఆమె టాలీవుడ్ డెబ్యూ మూవీ సాహో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మహేష్ హైట్ కి సరిపోయేలా దీపికా, కృతి సనన్, కత్రినా వంటి బ్యూటిఫుల్ స్టార్ లేడీస్ ని తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

నిజంగా శ్రద్దా కపూర్ ని మహేష్ కి జంటగా రాజమౌళి ఎంపిక చేశారా? లేదా? అనే విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్ ఓ మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ మూవీ పూర్తి చేయనున్నాడు.
Also Read:BJP- Pawan Kalyan: బీజేపీ, పవన్ కళ్యాణ్.. ఓ సీక్రెట్ భేటి