
ఏపీ రాజకీయాలు ఇప్పడు రామతీర్థం దేవస్థానం చుట్టూరా తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అంతేకాదు.. ఒకరి తర్వాత ఒకరు రామతీర్థం ఆలయాన్ని సందర్శిస్తూ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. మరోవైపు.. బీజేపీ నేతలు కూడా ఫైర్ అయ్యారు.
Also Read: రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి.. కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని..!
అయితే.. తాజాగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్ని ధ్వంసం చేయించింది చంద్రబాబే. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయి. పదవుల కోసం గుళ్లు, మసీదులు, చర్చిలు, తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడడం ఆశ్చర్యం. దేవుడులాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు. స్వార్థ రాజకీయాల కోసమే విజయనగరం జిల్లా రామతీర్థంలో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారు. రాజకీయాల్లో దేవుళ్లను అడ్డంపెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్లను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ల విగ్రహాలను డంపింగ్ యార్డ్‌ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ఆధ్వర్యంలోని అతని అనుచరులు అధీనంలో ఉన్న గుళ్ళు, ఊరికి దూరంగా ఉన్న గుళ్లలో దాడులు జరుగుతున్నాయి’ అని నాని విమర్శలు గుప్పించారు.
Also Read: ఎన్ని అడ్డంకులొచ్చినా దీక్ష కొనసాగిస్తాం..: కోదండరాం
‘అధికారంలో ఉన్నప్పుడు పగలు, లేనప్పుడు రాత్రివేళల్లో దేవాలయాలపై చంద్రబాబు దాడులు చేస్తున్నారు. భగవంతుడంటే నమ్మకం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రామతీర్థం ఘటనపై నీతి, నిజాయితీగా విచారణ చేసి దోషులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణలో చంద్రబాబు దోషిగా ఉన్నా.. లేదా..? అతని తండ్రి ఖర్జూర నాయుడు ఉన్నా, తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవనీ చవట, దద్దమ్మ లోకేష్.. ముఖ్యమంత్రి జగన్‌కు ఛాలెంజ్ విసరడం విడ్డూరం’ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్