https://oktelugu.com/

బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. అయితే హరీష్ రావుకు కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. లక్షణాలు లేని ‘అన్ సిమ్టామిక్’గా వైద్యులు తెలిపారు. కానీ జాగ్రత్తగా ఉండాలని చికిత్స తీసుకోవాలని సూచించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 / 11:22 AM IST
    Follow us on

    తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. అయితే హరీష్ రావుకు కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. లక్షణాలు లేని ‘అన్ సిమ్టామిక్’గా వైద్యులు తెలిపారు. కానీ జాగ్రత్తగా ఉండాలని చికిత్స తీసుకోవాలని సూచించారు.

    Also Read : అడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

    ఇక కరోనా వచ్చిన విషయాన్ని స్వయంగా హరీష్ రావు ట్వీట్ చేసి తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్విట్టర్ లో తెలిపారు. కాగా తనకు కరోనా రావడంతో తనను కలిసిన వారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని నేతలు, అధికారులకు హరీష్ రావు సూచనలు చేసినట్టు సమాచారం.

    తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడుతున్నారు. తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 30మంది ఎమ్మెల్యేల వరకు కరోనా బారిపడినట్లు సమాచారం. తాజాగా మంత్రులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు.

    Also Read : హాంఫట్.. తెలంగాణలో ఏం జరుగుతోంది?