https://oktelugu.com/

కరోనా దెబ్బకు అప్పులపాలు అయిపోతారు : వైద్య శాఖ మంత్రి ఈటెల

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టుల సంఖ్యను పెంచారు. దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తి పెరిగిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో ఒకేరోజు 60 వేలకు పైగా టెస్టులు నిర్వహించడం గమనార్హం. దానితో రోజుకి 1000-1500 వస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య కాస్తా ఒకే రోజుకు మూడు వేలకు చేరింది. ఇక ఎవరేజ్ గా రోజుకి రెండు వేల కేసులు నమోదు అవుతున్నాయి. కేసీఆర్ సర్కార్ మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంలో ఘోరంగా విఫలం అవుతోండి అన్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 29, 2020 / 09:00 AM IST
    Follow us on

    ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టుల సంఖ్యను పెంచారు. దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తి పెరిగిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో ఒకేరోజు 60 వేలకు పైగా టెస్టులు నిర్వహించడం గమనార్హం. దానితో రోజుకి 1000-1500 వస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య కాస్తా ఒకే రోజుకు మూడు వేలకు చేరింది. ఇక ఎవరేజ్ గా రోజుకి రెండు వేల కేసులు నమోదు అవుతున్నాయి. కేసీఆర్ సర్కార్ మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంలో ఘోరంగా విఫలం అవుతోండి అన్న విమర్శలు మాత్రం ఆగట్లేదు.

    Also Read : కరోనా వేళ ‘క్యాష్’ చేసుకోవడం ఇలా.!

    ఇకపోతే ప్రభుత్వం వారు అందిస్తున్న వైద్య సేవల పై నమ్మకం లేక ఎంతోమంది ప్రైవేట్ ఆస్పత్రుల బారినపడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దందాపై ఎన్ని కమిటీలు వేసినా… హైకోర్టు వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా…. ఏకంగా గవర్నర్ వార్నింగ్ లు ఇచ్చినా… ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక టెస్టులే సరిగ్గా చేయలేని ప్రభుత్వం మాకు వైద్యం ఏరకంగా అందిస్తుంది అన్న భావన వారిలో బలంగా పడిపోయింది అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రజలకు కీలక సూచనలు ఇచ్చారు.

    కరోనా సోకిన వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని ఆయన సూచించారు. అక్కడికి వెళ్లారు అంటే కచ్చితంగా మీరు అప్పులపాలు అయిపోతారు అన్నట్టు మాట్లాడిన ఆయన… ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు బాగున్నాయని… అక్కడే వైద్య సేవలు పొందాలని చెప్పారు. గతంలో కూడా తనకు కనుక కరోనా వైరస్ సోకితే… కచ్చితంగా తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే…. అదీ కాకుండా ఎన్నో విమర్శలు వస్తున్న గాంధీ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటానని ఈటెల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

    ఇక ప్రైవేట్ ఆస్పత్రుల విషయానికి వస్తే… రోజుకి లక్షలు ఖర్చయ్యే దగ్గర దాదాపు 30 లక్షల వరకు వసూలు చేస్తున్నారని.. అది మంచి పద్ధతి కాదని ఈటెల రాజేందర్ హితవు పలికారు. ఇకపోతే ఇప్పటికే ఇలా అధిక బిల్లులు చార్జి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వైద్యం అందించేందుకు అవసరమైన గుర్తింపును రద్దు చేశారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రక్షాళన ఇంకా చాలా ఉందని మంత్రి మాటలను బట్టి తెలుస్తోంది.

    Also Read : పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్