https://oktelugu.com/

గల్వాన్ లో చైనా సైనికులు చనిపోయారు.. ఇదిగో సాక్ష్యం..

చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 21మంది భారత సైనికులు అమరులయ్యారు. మన నల్గొండకు చెందిన కల్నల్ కూడా వీరోచితంగా పోరాడి మరణించారు. ఈ క్రమంలోనే ఆ ఘర్షణ తాలూకూ స్ఫూర్తి ప్రజల్లో వెల్లివిరిసింది. Also Read: ట్రంప్ తిరిగి పీఠం దక్కించు కుంటాడా? అయితే ఆ రాత్రంతా ఏం జరిగిందనే విషయంలో ఇప్పటికీ బయటపడలేదు. ప్రధాని మోడీని కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇదే విషయంపై గుచ్చి గుచ్చి అడిగాడు. ఆ రాత్రి […]

Written By: , Updated On : August 29, 2020 / 09:54 AM IST
Follow us on


చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 21మంది భారత సైనికులు అమరులయ్యారు. మన నల్గొండకు చెందిన కల్నల్ కూడా వీరోచితంగా పోరాడి మరణించారు. ఈ క్రమంలోనే ఆ ఘర్షణ తాలూకూ స్ఫూర్తి ప్రజల్లో వెల్లివిరిసింది.

Also Read: ట్రంప్ తిరిగి పీఠం దక్కించు కుంటాడా?

అయితే ఆ రాత్రంతా ఏం జరిగిందనే విషయంలో ఇప్పటికీ బయటపడలేదు. ప్రధాని మోడీని కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇదే విషయంపై గుచ్చి గుచ్చి అడిగాడు. ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై ఐటీబీపీ దళం అధికారికంగా వెల్లడించింది. గల్వాన్ లోయలో ఇటీవల చైనాతో జరిగిన ఘర్షణలో భారత సైన్యం రాత్రంతా పోరాడి ధీటుగా బదులిచ్చిందని.. చైనా సైనికుల ప్రాణాలు కూడా మనకంటే ఎక్కువే పోయాయని ఐటీబీపీ దళం తెలిపింది. కానీ చైనా మాత్రం ఇప్పటివరకు ఘర్షణల్లో ఎంతమంది చనిపోయారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

అయితే దాచేస్తే నిజం దాగదు కదా..చైనా ప్రభుత్వం ఎంత నిజాలను తొక్కిపెట్టాలని చూసినా అది తాజాగా బయటపడింది. తూర్పు లఢక్ లోని గల్వాన్ లోయలో జూన్ 15న భారత సైన్యంతో జరిగిన ఘర్షణల్లో చైనా సైనికులు పెద్ద ఎత్తున మరణించారు. దాదాపు 45-50మంది వరకు మరణించారని వివిధ వార్తా సంస్థలు తెలిపాయి. చైనా మాత్రం వివరించలేదు.

Also Read: మూడు సెకండ్ల వీడియో.. అమెరికాలో హల్చల్

అయితే చైనా దేశ సైనికులు చనిపోయారని తాజాగా చైనా సోషల్ మీడియా వేదిక అయిన ‘వెయ్ బో’లో హల్ చల్ చేస్తున్న ఫొటో తొలి సాక్ష్యంగా నిలిచింది. చైనాకు చెందిన యువ సైనికుడు చెన్ షియాంగ్రాంగ్ (19) సమాధి అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతడి సమాధిపై ‘2020 జూన్ లో భారత సరిహద్దుల్లో భారత బలగాలతో జరిగిన ఘర్షణలో చెన్ షియాంగ్రాంగ్ ప్రాణత్యాగం చేశాడు. కేంద్ర సైనిక కమిషన్ అతడిని స్మరించుకుంటోంది’ అని రాసి ఉంది. ఆగస్టు 5న ఈ సమాధిపై శిలను ఏర్పాటు చేశారు. దీంతో భారత సైనికుల దాడిలో చైనా సైనికులు భారీగానే చనిపోయారన్న విషయం తాజాగా తేటతెల్లమైంది.