Minister Dharmana Prasada Rao: ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు పెద్దగా స్వాగతించినట్టు లేరు. అందుకే మంత్రి ధర్మాన మాటమాటకు గుర్తుచేయాల్సి వస్తోంది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతోందని.. అద్భుతమైన అభివృద్ధి సాధ్యమని ధర్మాన చెప్పుకుంటూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మద్దతును కూడగట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. ఇప్పటికీ ప్రతిరోజూ స్టేట్ మెంట్లు ఇస్తునే ఉన్నారు. అయితే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయేసరికి ధర్మాన అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ రాజధాని అంటే ప్రజలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రజల నుంచి సరైన ఆన్సరే వస్తోంది. రాజధానిపై మాట్లాడే మంత్రులు ధర్మాన, బొత్సల క్లీయర్ కట్ పిక్చర్ వారి వద్ద ఉంది. 25 సంవత్సరాల్లో వారు మంత్రిగా ఉన్నసమయం ఎక్కువే. అప్పుడే కానీ అభివృద్ధి ఇప్పుడు ఏం జరుగుతుందిలే అంటూ లైట్ తీసుకుంటున్నారు. చివరకు తోటి ప్రజాప్రతినిధులు కూడా ధర్మాన వైపు అనుమానపు చూపులు చూస్తున్నారు. ఆ మధ్యలో విశాఖ క్యాపిటల్ కు మద్దతుగా ఓ సభలో చేయి ఎత్తమని కోరగా.. సభికుల నుంచి రిక్తహస్తమే ఎదురైంది.

సీఎం అనుమతిస్తే లక్షలాది మందితో ఉద్యమం చేయ్యాల్సి ఉందని ధర్మాన ప్రకటించారు. ఆ ప్రకటనకు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తుందని ఆశించారు. అయితే అదే సమయంలో రామోజీరావు తన ఈనాడు పత్రికలో ధర్మాన భూదందాను సర్వే నంబర్లతో సహా కథనాలు వండి వార్చారు. దీంతో ధర్మాన ఆరాటం వెనుక ఉన్న కథ ఇదా? అన్న చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి ధర్మాన మాటల్లో ధర్మం ఉంటే ప్రజలు కూడా హర్షించేవారు. ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలిపేవారు. దీంతో ఉత్తరాంధ్ర నాయకులు మొత్తం ద్రోహులే అన్నట్టు ధర్మాన చిటపటలాడడం ప్రారంభించారు.
ఏపీకి రాజధాని నిర్ణయించే సమయంలో అందరూ ముక్తకంఠంతో అమరావతిని ఆమోదించారు. ఇతర ప్రాంతాల వారెవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తనకు తాను అపార తెలివితేటలు ఉన్నవాడిగా భావించే మన ధర్మాన సైతం స్పందించిన దాఖలాలు లేవు. అంటే ఆహ్వానించినట్టే కదా. అందరూ ఆమోదం తెలిపినందునే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాజధానికిచ్చారు. అయితే ఇప్పుడు తమ భూ కబ్జాల కోసం, దందాల కోసం రాజధానిని మార్చేస్తాం.. విశాఖలో క్యాపిటల్ రాజధాని పెట్టేస్తాం.. అంటూ ప్రజల మెడపై కత్తి పెట్ట బెదిరించేలా ధర్మాన వ్యవహారం ఉంది.

వాస్తవానికి అమరావతి రైతులకు ఎంత దగా జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే వారిది త్యాగం కాదు..రియల్ ఎస్టేట్ వ్యాపారమని కూడా విమర్శలు చేశారు. అయితే ఆ విషయంపై ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్లారిటీ ఉంది. అదంతా రాజకీయ ఆరోపణల్లో భాగంగా చేసినవే అంటూ అందరికీ తెలుసు. రేపు అదే పరిస్థితి తమకు ఎదురవుతుందని తెలుసు. అవన్నీ తెలిసి సమస్యలు ఏరికోరి తెచ్చుకునే పరిస్థితుల్లో వారు లేరు. అయితే ధర్మాన వ్యూహం ధర్మానది. మాజీ సైనికుల పేరిట కొట్టేసిన భూమి వివరాలు సిట్ దర్యాప్తు నివేదికలో ఉన్నాయి. దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు కొత్త ఎత్తుగడను వేశారన్న అనుమానం ప్రజలందరిలోనూ ఉంది, ఇటువంటి సమయంలో ధర్మాన వంటి వారు ప్రజల సహకారం కోరడం అతిగా ఉంది.. అతిశయోక్తిగా ఉంది.