Waltair Veerayya: ఊరమాస్ యాక్షన్.. అదిరిపోయే బ్రేక్ డ్యాన్స్.. రోమాలు నిక్కబొడిచె పవర్ ఫుల్ డైలాగ్స్.. ఇవన్నీ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవిలో కనిపించేవి. కానీ అయన ఇలాంటి ప్రయోగాలకు చాలారోజులుగా చిరు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి పాత చిరంజీవి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. నోట్లో బీడీ.. గల్లా లుంగీ.. శత్రువులను చీల్చిచెండాడుతానన్న ధీమా లుక్ తో మెగాస్టార్ ఆకట్టుకుంటున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి లుక్స్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిరంజీవి గెటప్ ను చూసి మరో ‘ముఠామేస్త్రీ’ అవుతుందా..? అని చర్చలు పెట్టుకుంటున్నారు.

1993లో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ముఠామేస్త్రీ థియేటర్లో సందడి చేసింది. ఇందులో చిరంజీవి గెటప్ అదుర్స్. సినిమాలో సగభాగం వరకు లుంగీతోనే కనిపిస్తాడు. లేబర్ నాయకుడిగా నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మిగతా సగభాగం పొలిటికల్ లీడర్ గా కనిపించడంతో అప్పుడే చిరు రాజకీయాల్లోకి వస్తాడని చర్చలు పెట్టారు. ఇందులో నటనకు చిరంజీవి ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. రోజా, మీనాలు కలిసి నటించిన ఈ సినిమా పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి.
బాబీ దర్శకత్వంలో వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి లుక్స్ అలాగే ఉన్నాయి. యాంగర్ తో కలిసి కనిపిస్తున్న చిరు ఓ పడవపై కూర్చున్నాడు. అంటే మత్స్యకారుల తరుపున పోరాటం చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో పొలిటికల్ బ్యాక్రాండ్ ఉంటుందా..?అనేది తెలియాల్సి ఉంది. కానీ ముఠామేస్త్రీ లాగే వాల్తేరు వీరయ్య గెటప్ కూడా చిరంజీవి నోట్లో బీడీ పొగలు కక్కిస్తున్నాడు. లుంగీతో పాటు చేతికి అనేక దారాలు కనిపిస్తున్నారు. ఈ లుక్ తో పాటు టీజర్ చూస్తుంటే ముఠామేస్త్రీ లెవల్లోనే సాగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇందులో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. రవితేజ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.

ముఠామేస్త్రీని జనవరి 17 1993న రిలీజ్ చేశారు. ఇప్పడు ‘వాల్తేరు వీరయ్య’ను కూడా జనవరిలో రిలీజ్ చేయనున్నారు. అంటే అప్పుడు సంక్రాంతి సందర్భంగా సినిమాను రిలీజ్ చేయడంతో బ్లాక్ బస్టర్ అయింది. ఈసారి సంక్రాంతి కానుకగా చిరు థియేటర్లోకి రానున్నారు. దీంతో ‘వాల్తేరు వీరయ్య’ కూడా బాక్సాఫీస్ ను కొల్లగొడుతుందని అంటున్నారు. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇలాంటి మాస్ లుక్ లో కనిపించడం ఇదే మొదటి సారి. దీంతో ఈ మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ ఎలాంటి గూస్ బంప్స్ తెప్పిస్తాడో చూడాలి.