Minister Dharmana Prasada Rao: రెండు దశాబ్దాల్లో దాదాపు 15 ఏళ్ల పాటు మంత్రులుగా కొనసాగుతున్నారు సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు. తాము పదవుల్లో ఉండగా ఏంచేశారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఉత్తరాంధ్ర ఎటువంటి అభివృద్ది చెందలేదని కొత్త పల్లవి అందుకున్నారు. విశాఖ రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు. మంత్రి ధర్మాన అయితే తన తెలివితేటలను రంగరించి మరీ ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చే ప్రయత్నంలో ఉన్నారు. విశాఖ రాజధానిని ఒప్పుకోని వారంతా రాక్షసులతోనే పోల్చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. వారి కాలర్లు పట్టుకొని నిలదీయ్యాలని పిలుపునిచ్చారు. సీఎం అనుమతిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి లక్షలాది మందితో ఉద్యమిస్తానని కూడా ధర్మాన ప్రతినబూనారు.

అయితే ధర్మానలో ఇంత ప్రస్టేషన్ కు కారణమేంటబ్బ అని అందరూ కారణాలను అన్వేషించారు. ఆయనకు ఉపయోగం లేనిదే దేనికీ స్పందించరు. పిట్ట కథలు వర్ణించారు. దీర్ఘాలు పలకరు. మరి విశాఖపై ఇంతలా ప్రేమ కనబరస్తుండడం వెనుక పెద్ద నిర్వాకమే ఉందట. అది సిట్ రిపోర్టులో పదిలంగా ఉందట. ప్రభుత్వం విశాఖ భూ దందాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆ దర్యాప్తులో మంత్రి ధర్మాన నిర్వాకం వెలుగుచూసింది. మంత్రిగా ఉన్నప్పుడు కొంత మంది మాజీ సైనికులకు భూములు కేటాయించారు. ముందస్తు ఒప్పందం ప్రకారం వారి నుంచి తిరిగి కొనుగోలు చేశారు. ఈ దందాకు సంబంధించి సాక్షాలతో సహా సిట్ రిపోర్టులో ఉంది. దాని వల్లే ఆయన ఆందోళనతో ఏవేవో మాట్లాడేస్తున్నారు.

ఇటీవల మంత్రి ధర్మాన నోటి నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదని తరచూ వస్తోంది. కానీ ఆయన మాత్రం బాగానే అభివృద్ధి చెందారు. కీలకమై రెవెన్యూ పోర్టుపొలియోను దక్కించుకొని బాగానే ఆస్తులను పోగుచేసుకున్నారు. వందల వేల కోట్ల రూపాయలను వెనుకేసుకున్నారు. ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు కానీ.. తాము కొంత దోచుకొని.. ఇతరులు కొంత దోచుకోవడానికి మాత్రం సహకరించారు. ఇన్నాళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఉత్తరాంధ్ర అభివృద్దిని ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. విశాఖ రాజధానితో మరో దోపిడీకి తెరలేపేలా ఉన్నారని ఆయనపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సీట్ రిపోర్టు బయటపడితే మాత్రం ధర్మానపై చర్యలు ఖాయం. అందుకే అది బయటపెట్టకుండా ఉంచేందుకు జగన్ ఆదేశాలను ధర్మాన తూచా తప్పకుండా పాటించి అమలు చేస్తున్నారన్న మాట.