Botsa Satyanarayana: అదేంటో గానీ జగన్ ప్రభుత్వానికి అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు వివేకా హత్య కేసులో జగన్, అవినాశ్‌కు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అటు మూడు రాజధానుల విషయంలో కూడా షాక్ తగులుతోంది. నిన్న కేంద్రం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ.. సచివాలయ నిర్మాణానికి నిధులు కూడా కేటాయించింది. ఈ రోజేమో హైకోర్టు సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాలని, రైతులు ప్లాట్లను డెవలప్ చేసి ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చింది.
అయితే ఈ షాక్ నుంచి వైసీపీ కోలుకోనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే చాలామంది వైసీపీ లీడర్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. తాము మూడు రాజధానుల బిల్లును ఇప్పటికే ఉపసంహరించుకున్నామని, సీఆర్డీయే అమలులోనే ఉందన్నారు. అయితే కోర్టు తీర్పులను గౌరవిస్తామని చెబుతూనే.. సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై చర్చిస్తామన్నారు.
Also Read: నిజంగానే మంత్రిపై హత్యకు కుట్ర జరిగిందా?
ఇదే సమయంలో మూడు రాజధానుల విషయంలో కూడా తగ్గేదే లే అంటున్నారు. తమ ప్రభుత్వ విధానమే మూడు రాజధానులు అంటూ చెబుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణ కావాలన్నదే తమ ఆలోచన అంటున్నారు. అయితే కోర్టు తీర్పుపై ఆయన మాట్లలో అసహనమే కనిపిస్తోంది. తాము కోర్టుకు లోకువ అయిపోయామన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు.
హై కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తమ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికే కట్టుబడి ఉందంటూ ఆయన చెబుతున్నారు. మొత్తంగా చూస్తుంటే మాత్రం.. హై కోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం మింగుడు పడటం లేదని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులకే తమ ఓటు అన్నట్టు నేతలు మాట్లాడుతున్నారు. ఇక హై కోర్టు తీర్పును కూడా వైసీపీ వ్యతిరేకిస్తోంది. కోర్టు తీర్పు తమకేం పెద్ద షాక్ కాదంటూ చెబుతోంది. చూస్తుంటే.. సుప్రీంకోర్టు తలుపు తట్టేలాగే కనిపిస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఎలాగూ హై కోర్టులో షాక్ తగిలింది కాబట్టి.. కొత్త చట్టాలను తీసుకు వచ్చేలోపే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: విద్యారంగంలో జగన్ మార్పులు.. ఏపీ భవిష్యత్తును మార్చుతుందా? కూల్చుతుందా?