Rajamouli: చరణ్ – ఎన్టీఆర్ ల మధ్య తేడా చెప్పిన రాజమౌళి !

Rajamouli: నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రచారాన్ని ముంబయిలో ఇటీవల నిర్వహించారు. చరణ్‌, తారక్‌ ల మధ్య ఉన్న తేడా గురించి రాజమౌళి మాట్లాడారు. సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ వేడుకకు సంబంధించిన వీడియోల్ని చిత్ర బృందం […]

Written By: Raghava Rao Gara, Updated On : March 27, 2022 10:20 am
Follow us on

Rajamouli: నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రచారాన్ని ముంబయిలో ఇటీవల నిర్వహించారు. చరణ్‌, తారక్‌ ల మధ్య ఉన్న తేడా గురించి రాజమౌళి మాట్లాడారు. సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ వేడుకకు సంబంధించిన వీడియోల్ని చిత్ర బృందం విడుదల చేసింది.

SS Rajamouli with NTR and Charan

కాగా రాజమౌళి మాట్లాడుతూ.. “రామ్‌ చరణ్‌ అద్భుతమైన నటుడు. కానీ, ఆ విషయం తనకు తెలియదు. ఎన్టీఆర్‌ కూడా అద్భుతమైన నటుడు. ఆ విషయం తనకు తెలుసు” అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు ఎన్టీఆర్ – చరణ్ ల గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. “ఓ సన్నిపోనికి సంబంధించిన చిత్రీకరణ పూర్తికాగానే రామ్‌ చరణ్‌ని హగ్‌ చేసుకుని బాగా చేశావు అని కితాబిస్తా. ‘బాగుందా సర్‌… మీకు నచ్చిందా సర్‌.. మీకు నచ్చితే ఓకే సర్‌ అని అంటాడు.

Also Read:  మూడేళ్ల చిన్నారిపై ముస‌లివాడి అఘాయిత్యం

అదే తారక్‌ విషయానికొస్తే. తన నటన చూసి బాగుందని చెప్పేలోపు ‘జక్కన్నా..’ అదరగొట్టేశా కదా అంటాడు. తనపై తనకున్న విశ్వాసం అది. ఇలాంటి ఇద్దరు గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. సినిమా కోసం వారిద్దరినీ విపరీతంగా కష్ట పెట్టా. చిత్రీకరణ తొలిరోజు నుంచే శ్రమపెట్టా. పరిచయ సన్నివేశం కోసం
తారక్‌ను పాదరక్షలు లేకుండా అడవిలో పరిగెత్తించా. చరణ్‌ను వేలమంది సభ్యుల మధ్య దుమ్ములో నిలబెట్టా.అంటూ రాజమౌళి చెప్పాడు.

Rajamouli, Jr NTR and Ramcharan

దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతుంది ఈ ప్యాన్‌ ఇండియా మూవీ. మొత్తానికి జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఈ భారీ సినిమా.. మార్చి 25కి షిఫ్ట్ అయింది. మరి ఆ డేట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

Also Read: మూడేళ్ల చిన్నారిపై ముస‌లివాడి అఘాయిత్యం

Tags