Minister Amarnath Pawan’s martial arts : ఎదుటి వారిని ఆడిపోసుకోవడం…తామకు కాదన్న వ్యవహారంలో వేలు పెట్టి చేయి కాల్చుకోవడం కొందరికి అలవాటు. అది వారి బుద్ధి మాంధ్యం కూడా. అయితే ఇటువంటి అలవాటు ఏపీ మంత్రుల్లో కొందరికి ఉంది. చాలా సందర్భాల్లో ఇది తెలిసింది కూడా. తాజాగా యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిల్ల చేష్టలతో తన బుద్ది మాంధ్యాన్ని బయటపెట్టి నవ్వుల పాలయ్యారు. జన సైనికులు ఆయన్ను అడ్డంగా ఉతికి ఆరేస్తున్నారు. తాను 20 సంవత్సరాల తరువాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని పవన్ పెట్టిన ఫొటోపై మంత్రి అమర్నాథ్ వెటకారంగా స్పందించారు. దీనిని మార్షల్ ఆర్ట్స్ అంటారాఅని ప్రశ్నిస్తూ.. తిరిగి పవన్ కే ట్యాగ్ చేశారు. దీంతో రచ్చ రంబోలా స్టార్ట్ అయ్యింది. జన సైనికులు రియాక్టయ్యేసరికి మంత్రి అమర్నాథ్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే ఇలా అవమానబడడం అమర్నాథ్ కు కొత్త కాదు. గతంలో కూడా జన సైనికులు ఆయన్ను పాడె కట్టిన సందర్భాలున్నాయి.

అయితే అమర్నాథ్ తాజా కామెంట్స్ కు జనసేన శ్రేణులు చుక్కలు చూపిస్తున్నారు. అమర్నాథ్ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోలను పోస్టు చేస్తూ… అదిమార్షల్ ఆర్ట్స్ కాదు.. ఇది అసలు సిసలైన మార్షల్ ఆర్ట్స్ అంటూ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే అసలు మంత్రి ఇంగ్లీష్ తో ఆడే మార్షల్ ఆర్ట్స్ ముందు… మరెవరి మార్షల్ ఆర్ట్స్ నిలబడదని షటైర్లు వేస్తున్నారు. అందుకు సంబంధించి పాత వీడియోలను లింక్ చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేరు. కానీ ఓ ఇంగ్లీష్ చానల్ తో మాట్లాడే ప్రయత్నం చేసి అబాసుపాలయ్యారు. దానిని గుర్తుచేస్తూ పెడుతున్న వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అటు మంత్రి రికార్డింగ్ డ్యాన్స్ లు, ఇటు వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడే వీడియోలు నెటిజెన్లుకు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మంత్రి శైలిని ఆలోచింపజేస్తున్నాయి.
గుడివాడ అమర్నాథ్ ది పిల్ల చేష్టలుగా ఎక్కువ మంది అభివర్ణిస్తారు. మంత్రి పదవి దక్కేసరికి ఆయనకు కాలు నిలబడడం లేదు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికే మంత్రి పదవి ఇచ్చినట్టు అయినదానికి.. కానిదానికి విమర్శలు చేసి చాలాసార్లు అబాసుపాలైన సందర్భాలున్నాయి. ఓ సారి పవన్ ను నేనెప్పుడూ కలవలేదని… పవనే తనను కలవడానికి వచ్చాడంటూ ఫొటో చూపించి జనాలకు నవ్వులు పంచారు. సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. అయితే ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యమిచ్చే క్రమంలో పవన్ ను విమర్శించి ఫేమౌస్ అవడానికి ప్రయత్నిస్తుంటారని విశాఖ వాసులు షటైర్లు సైతం వేస్తుంటారు.
పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా విభేదించవచ్చు. కానీ ఆయన చేసిన ప్రతీ పనిని వెటకారంగా మాట్లాడడం మాత్రం మానసిక అపరిపక్వతను తెలియజేస్తోంది. మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులు ఎక్కువగా ఇటువంటి అపరిపక్వత రుగ్మతతో బాధపడుతున్నట్టున్నారు. అందుకే చీటికి మాటికి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతుంటారు. అంబటి రాంబాబు అయితే పవన్ వేసుకున్న దుస్తులను చూసి కూడా సహించలేకపోయారు. ఇప్పుడు అమర్నాథ్ పవన్ నేర్చుకుంటున్న విద్యను పలుచన చేసి మాట్లాడారు. పవన్ ను అంటే జగన్ దగ్గరకు చేర్చుకోవచ్చు కానీ జన సైనికులు ఊరుకునే ప్రసక్తే లేదు. కానీ తమకు పరువు అన్నదే లేనట్టుగా ఉన్న వైసీపీ మంత్రులు మాత్రం మానసిక స్థితిని మరింత దిగజార్చుకుంటున్నారు.