Mini Bangladesh in India: ఒక్క మమతా బెనర్జీ మాత్రమే కాదు కదా.. కెసిఆర్, స్టాలిన్, చంద్రబాబు, విజయన్, సిద్ధరామయ్య.. వంటి వారు మొత్తం ఈ తానులో ముక్కలే. ఇప్పుడంటే చంద్రబాబుకు అవసరం కాబట్టి మోడీతో ఉంటున్నాడు కాబట్టి.. కాస్త కఠిన వైఖరి అవలంభించినట్టు కనిపిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన కూడా గుళ్లను కూల్చి వేయించినవాడే. మనదేశంలో బంగ్లా ప్రేమిక నాయకులు.. పాకిస్తాన్ ఉద్దారక లీడర్లకు కొదవలేదు. కానీ దశాబ్దాలుగా బిజెపి పరిపాలిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో బంగ్లాదేశీయులు పాతుకు పోయారు. గుజరాత్ రాష్ట్రంలో దశాబ్దాలుగా బిజెపి పరిపాలిస్తున్నప్పటికీ.. అక్కడ బంగ్లాదేశీయులు తిష్ట వేసుకొని ఉండడమే అసలైన డిబేటబుల్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుందో? లేదో తెలియదు గాని.. గుజరాత్ రాష్ట్రంలో బలంగా నిలబడిన మినీ బంగ్లాదేశ్ మొత్తాన్ని నేలమట్టం చేసే పని విజయవంతంగా సాగుతోంది. వాస్తవానికి ఇలాంటి కథనాలను చూపించడం తెలుగు మీడియాకు చేతకాదు. ఎంతసేపటికి అడ్డగోలు వార్తలను.. అడ్డగోలు విశ్లేషణలను మాత్రమే తెలుగు మీడియా ప్రసారం చేస్తుంది.. ప్రచారం చేస్తుంది.
కొంతకాలంగా గుజరాత్ రాష్ట్రంలో మినీ బంగ్లాదేశ్ ను పూర్తిగా నేలమట్టం చేసే పని విజయవంతంగా సాగుతోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం దాదాపు 3వేల వరకు గృహాలను నేలమట్టం చేశారు. దుకాణాలను కూల్చివేశారు. కంగా రెండు వేలమంది సైనికులు మోహరించారు. అడ్డొస్తే కాల్చివేత ఉత్తర్వులు వచ్చాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలో చందోల అనే ఒక సరస్సు ఉంది. విస్తీర్ణంలో అతిపెద్దది. ఈ సరస్సు ప్రాంతంలో బీహార్ నుంచి వచ్చిన మెహబూబ్ పటాన్ అలియాస్ లల్లా అనే వ్యక్తి అక్కడ ఇల్లీగల్ గా నిర్మాణాలు మొదలుపెట్టాడు. లల్ల కొడుకు పేరు ఫతే.. ఇతడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఆశ్రయం కల్పించడం మొదలుపెట్టాడు. ఇక వీరి కోసం నకిలీ గుర్తింపు కార్డులను లల్లా టీం రెడీ చేసింది.. ఆధార్ కార్డులను, ఓటర్ కార్డులను జారీ చేసింది. వాళ్లను ఏకంగా భారతీయ పౌరులను చేసేస్తుంది. ఈ సరస్సులో ఉన్నందుకు ఒక్కో వ్యక్తి నుంచి లక్షల్లో వసూలు చేసేవాడు లల్లా. ఇక ఆధార్ కార్డులకు, ఓటర్ కార్డులకు రెండు లక్షల వరకు దండుకున్నాడు. గుడిసెలకైతే 5000 వరకు రెంటు వసూలు చేశాడు. రిక్షాలు, ఇతర వాహనాలు నిలుపుదల చేసినందుకు 20 నుంచి 50 రూపాయల వరకు ప్రతిరోజు వసూలు చేసేవాడు. అక్రమంగా బోర్లు వేసి.. ఆ నీటిని అమ్మాడు.. ఇక బంగ్లాదేశ్ మహిళలు వ్యభిచారం ద్వారా డబ్బులు సంపాదించేవారు. ఒక రకంగా అక్రమంగా ప్లాట్లను వ్యభిచార గృహాలుగా మార్చాడు లల్లా. ఇక లల్లాకు నలుగురు భార్యలు ఉన్నారు. అందరికీ ఈ ప్రాంతంలో గృహాలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లల్లాకు చీకటి వ్యాపారాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఆపరేషన్ మొదలైన తర్వాత.. లల్లా భయపడిపోయాడు.. ఎక్కడో రాజస్థాన్ వెళ్లి తలదాచుకున్నాడు. రాజస్థాన్లోని క్రైమ్ బ్రాంచ్ కూడా రంగంలోకి దిగింది.. లల్లాను వెతికి వేటాడి పట్టుకుంది. అతని కుమారుడని కూడా అరెస్టు చేసింది.. ఇద్దరికీ బేడీలు వేసి.. ఆ మినీ బంగ్లాదేశ్లో మొత్తం తిప్పారు.. అయితే ఈ ప్రాంతంలో ఉన్న ఆక్రమణలు మొత్తం తొలగించి.. అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ల కోసం గృహాలు కట్టించి ఇస్తారట.
Also Read: Jagan Action Pawan Reaction: జగన్ యాక్షన్.. పవన్ రియాక్షన్.. వీడియో వైరల్!
కేవలం అహ్మదాబాద్ మాత్రమే కాదు తమిళనాడు నుంచి మొదలు పెడితే తెలంగాణ వరకు బంగ్లా అక్రమ వలసదారులు ఎంతోమంది ఉన్నారు. ఇక రోహింగ్యాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అయితే అత్యంత దారుణం. అనేక జిల్లాలు అక్రమంగా వచ్చిన వలసదారులతో పూర్తిగా నిండిపోయాయి. ఇదిగో ఇలాంటి సోకాల్డ్ మమతా బెనర్జీ లాంటి వాళ్లు ఆందోళనలు చేయిస్తారు. శాంతి భద్రతల సమస్యను ఏర్పడేలా చేస్తారు. ఇలాంటి నెత్తి మాసిన రాజకీయ నాయకుల వల్ల భారత్ మొత్తం శరణార్థులకు స్థావరం అయిపోయింది. డొల్ల పార్టీలు పౌరసత్వ సవరణ చట్టాన్ని అడ్డుకుంటాయి. సమానత్వం.. సౌబ్రాతృత్వం అంటూ నెత్తి మాసిన మాటలు మాట్లాడుతుంటాయి. వాస్తవానికి మనకు బార్డర్ అవతల ఉన్న పాకిస్తాన్ మాత్రమే కనిపిస్తోంది. కానీ మనదేశంలో ఉన్న ఉపద్రవాలు ఎన్నో ఉన్నాయి.. అయితే ఎంతో గొప్పగా చెప్పుకునే గుజరాత్ ప్రభుత్వం ఈ స్థాయిలో ఒక మినీ బంగ్లాదేశ్ ఏర్పడేదాకా ఎలా చూస్తూ ఊరుకుంది? అక్కడ ఉంది మమత సర్కార్ కాదు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ అంతకన్నా కాదు.. మరి ఈ విషయంలో బిజెపి ఏం సమాధానం చెప్పుకుంటుంది?