https://oktelugu.com/

వైరల్ వీడియో: ఎంఐఎం నేత కాల్పులు.. ముగ్గురు సీరియస్

ఆయనో ఎంఐఎం నేత.. లైసెన్స్ డ్ రివాల్వర్ ఉంది. ఆయన కుమారుడు క్రికెట్ ఆడుతుండగా పిల్లల మధ్య గొడవ జరిగింది. అప్పటికే ప్రత్యర్థులతో ఆ ఎంఐఎం నేతకు పాత గొడవలున్నాయి. ఇదే అదునుగా తుపాకీ చేత బట్టి వచ్చిన సదురు ఎంఐఎం నేత విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. Also Read: గ్రేటర్లో సమస్యలను పట్టించుకునే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2020 / 08:22 PM IST
    Follow us on

    ఆయనో ఎంఐఎం నేత.. లైసెన్స్ డ్ రివాల్వర్ ఉంది. ఆయన కుమారుడు క్రికెట్ ఆడుతుండగా పిల్లల మధ్య గొడవ జరిగింది. అప్పటికే ప్రత్యర్థులతో ఆ ఎంఐఎం నేతకు పాత గొడవలున్నాయి. ఇదే అదునుగా తుపాకీ చేత బట్టి వచ్చిన సదురు ఎంఐఎం నేత విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

    Also Read: గ్రేటర్లో సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా?

    ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ ఒక చేతిలో కత్తి, మరో చేతిలో రివాల్వర్ చేత బూని స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఫారూఖ్ రెండు రౌండ్లు కాల్పులు జరపగా.. ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బులెట్లు దూసుకెళ్లాయి. బాధితులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

    Also Read: కేకలు వేసిన పిల్లోడు.. అభినందించిన ఎమ్మెల్యే..! విషయమెంటీ?

    ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఫారుఖ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    కాగా పాత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తొలుత ఇరువర్గాల మధ్య ఘర్షణ ఆ తర్వాత కాల్పులకు దారితీసినట్టు స్థానికులు చెబుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్