Mekapati Familly : రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో మేకపాటి కుటుంబం ఒకటి. నెల్లూరు రాజకీయాలను శాసించింది ఈ కుటుంబం. ముఖ్యంగా ఉదయగిరిని సుదీర్ఘ కాలం ఆ కుటుంబమే ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ కుటుంబంలో గడ్డు పరిస్థితులు దాపురించాయి. మేకపాటి సోదరులు రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు దారులు వేరయ్యాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్న నిర్ణయాన్ని కాదని చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ఆయనపై వైసీపీ హైకమాండ్ సస్సెన్షన్ వేటు వేసింది. అదే జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై సైతం వేటుపడింది. అయితే ఆ ఇద్దరికీ టీడీపీ టిక్కెట్లు కన్ఫర్మయ్యాయని వార్తలు వచ్చాయి. చంద్రశేఖర్ రెడ్డి విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ తరుణంలో దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు కంభం విజయరామిరెడ్డిని చంద్రశేఖర్ రెడ్డి కలుసుకోవడం అనూహ్య పరిణామం.
సుదీర్ఘ నేపథ్యం..
1983 నుంచి మేకపాటి కుటుంబం రాజకీయాల్లో ఉంది.మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసింది ఈ నియోజకవర్గం నుంచే. 1983లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్ధిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతిలో ఓడారు.1985 నాటికి సీఎన్ మారింది. మొదటిసారి మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలిచారు. ఆయనకు ప్రత్యర్ధిగా కంభం విజయరామిరెడ్డి ఉన్నారు. అలా కంభం విజయరామిరెడ్డి మేకపాటి ఫ్యామిలీ మధ్య దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. 1994 1999లలో కంభం విజయరామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు. ఇక 2004 నుంచి మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. కంభం విజయరామిరెడ్డి టీడీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటికీ ఆ రెండు కుటుంబాల మధ్య వైరం అలానే ఉంది.
ఆ ఇద్దరు క్లారిటీ..
మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పార్టీ అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై చర్యలు తీసుకుంది. ఆ ఇద్దరికీ టీడీపీ టిక్కెట్లు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరికపై మాత్రం క్లారిటీ లేదు. ఆయన కూడా పెద్దగా ఆసక్తికనబరచలేదు. తనకు అంత ఆర్థిక స్థోమత లేదని చెప్పుకొచ్చారు. అయితే టీడీపీలో కంభం కుటుంబంతో వైరం వల్లే చంద్రశేఖర్ రెడ్డి వెనుకడుగు వేశారన్న టాక్ వినిపించింది. అయితే అనూహ్యంగా మేకపాటి చంద్రశేఖర రెడ్డిని కంభం విజయరామిరెడ్డి కలుకున్నారు. ఈ ఇద్దరి తాజా భేటీ నెల్లూరు రాజకీయాల్లో కలకలం రేపింది.
ఆ ప్రతిపాదనకు నో..
అయితే ఉదయగిరి నియోజకవర్గం తమ కుటుంబం నుంచి చేజారకుండా రాజమోహన్ రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి సైలెంట్ అయి ఆయన కుమార్తె రచనా రెడ్డికి వైసీపీ టికెట్ ఇప్పించి తద్వారా ఆ డ్యామేజ్ ని లేకుండా చేసుకోవాలని రాజమోహన్ రెడ్డి వ్యూహరచన చేశారు. అయితే ఈ చర్యలేవీ ఫలించలేదు. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను చంద్రశేఖర్ రెడ్డి తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. దానికంటే టీడీపీలో చేరడానికే మొగ్గుచూపినట్టు సమాచారం. అవసరమైతే కంభం విజయరామిరెడ్డికి సపోర్టు చేయడానికి డిసైడయినట్టు పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. సో త్వరలో చంద్రశేఖర్ రెడ్డి సైకిలెక్కబోతున్నారు మాట.