Prabhas Adipurush Look: ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ కోసం మేకర్స్ ఎంత ఖర్చు చేసారో తెలిస్తే నోరెళ్లబెడుతారు..!

శ్రీ రాముడిగా చేసిన ప్రభాస్ లుక్స్ పై నెగటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ, ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, రామాయణం ని ఇంత లార్జి స్కేల్ లో సరికొత్త టెక్నాలజీ తో ఇది వరకు ఎవ్వరూ కూడా సినిమాలు తియ్యలేదని.

Written By: Vicky, Updated On : May 10, 2023 11:59 am

Prabhas Adipurush Look

Follow us on

Prabhas Adipurush Look: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు , హిందీ, తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

శ్రీ రాముడిగా చేసిన ప్రభాస్ లుక్స్ పై నెగటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ, ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, రామాయణం ని ఇంత లార్జి స్కేల్ లో సరికొత్త టెక్నాలజీ తో ఇది వరకు ఎవ్వరూ కూడా సినిమాలు తియ్యలేదని. కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించబోతుందని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే టీజర్ విడుదలైనప్పుడు నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడం తో సినిమా విడుదల ని సంక్రాంతి నుండి జూన్ 16 వ తేదికి మార్చిన సంగతి తెలిసిందే. అంటే గ్రాఫిక్స్ కోసం డబుల్ ఖర్చు అయ్యింది అన్నమాట.దాని సంగతి పక్కన పెడితే, కేవలం ప్రభాస్ మేకప్ కోసం అయిన ఖర్చు, షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి పది కోట్ల రూపాయిలు అయ్యిందట.

ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం, ఆయన మేకప్ దగ్గర నుండి, కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చేసిన కొన్ని మార్పుల వరకు కేవలం ప్రభాస్ కోసం అంత భారీ మొత్తం లో ఖర్చు అయ్యిందట.అయితే ఇంత ఖర్చు చేసిన డైరెక్టర్ ఓం రౌత్ కి,శ్రీ రాముడికి మీసం ఉండదు అనే విషయం తెలియదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్ల్స్ చేస్తున్నారు. అయితే రాముడు అంటే ఇలాగే ఉంటాడు అని కొంతమంది పెద్దలు తప్పుడు ప్రచారం చేసారని, ఇది ఆయన అసలు రూపం అంటూ ఓం రౌత్ గతం లో మీడియా కి సమాధానం చెప్పాడు.