Meghalaya infiltration incident: భారత దేశంలో జరిగే విషయాలను కూడా మన మీడియా బయటకు రాన్విడం లేదు. అల్లర్లు జరిగినా, కాల్పులు జరిగినా, చివరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నా మీడియాలో ఎక్కడా ఒక్క వార్త కూడా రావడం లేదు. దీనికి కారణం చొరబాటుదారులకు, భారతీయులకు మధ్య ఘర్షణే కారణం. మార్చి 10 నుంచి మేఘాలయ గారో హిల్స్‌లో నెలకొన్న ఉద్రిక్తత కొనసాగుతోంది. గిరిజనుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. సైన్యం, పోలీసులు తుపాకులు పట్టుకుని పహారా కాస్తున్నారు.
.
రక్షణ కోసం గిరిజనుల పోరాటం
గారో హిల్స్ ఆటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (జీహెచ్‌ఏడీసీ) ఎన్నికలు గారో గిరిజనుల హక్కులు, భూమి రక్షణ కోసం రూపొందాయి. మార్చి 10న మొదలైన ఈ ప్రక్రియలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అభ్యర్థి నిలబెట్టడానికి మాజీ ఎమ్మెల్యే ఎష్మతుర్ మోమిన్ ప్రయత్నించాడు. స్థానికులు దీన్ని తమ గుర్తింపు, ఉపాధి అవకాశాలపై దాడిగా చూశారు. ఫలితంగా ఉద్రిక్తి మార్చి 13కు చేరింది.
గారో మహిళపై దాడి..
గారో మహిళ బిడ్డతో అడవిలో వెళ్తుండగా బంగ్లాదేశ్‌కు చెందిన అన్సార్ ఫోర్స్ సభ్యులు దాడి చేసి ‘ఇది మా ప్రాంతం, వెళ్లిపో‘ అని హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందడంతో గిరిజనుల కోపం పెరిగింది. ఎన్నికల సమయంలో ఇది బయటపడటంతో మోమిన్‌పై ఆరోపణలు రుజువయ్యాయి. చొరబాటుదారుల మద్దతుతో ఎన్నికలు జరుగుతాయని అనుమానం.
Also Read: బెంగాల్ బీహార్ గవర్నర్ల మార్పు తో ఏదో జరుగుతుందని పుకార్లు
అల్లర్లు, కాల్పులు..
గిరిజనులు మోమిన్‌పై దాడి చేశారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు గారో యువకులు చనిపోయారు. పరిస్థితి తీవ్రమైనా పహారా, కర్ఫ్యూ విధించారు. ‘కనిపించినట్టు కాల్చివేయాలి‘ అనే ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. సైన్యం రంగంలోకి దిగి ఎన్నికలు వాయిదా వేశారు.
బంగ్లాదేశ్ చొరబాటు సమస్య..
మేఘాలయలో 30% జనాభా బంగ్లా నేపథ్యం చొరబాటు భూమి, ఉద్యోగాలపై ఆక్రమణకు దారితీస్తోంది. జీహెచ్‌ఏడీసీ ఎన్నికలు గిరిజనులకు మాత్రమే (సీట్లు). కానీ చొరబాటుదారులు గారోల భూమి హక్కులను హరిస్తున్నారు. ఎన్నికల రాజకీయాల్లో చొరబాటుదారుల పాత్రను సూచిస్తోంది. దీంతో స్థానిక గారా గిరిజనులు అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. గిరిజనుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు, కొందరు హిందువులు. చొరబాటుదారులు ముస్లింలు.
తాజా ఘటనపై మేఘాలయ ప్రభుత్వం దర్యాప్తు ప్రకటించింది. సైన్యం కర్ఫ్యూ కొనసాగిస్తోంది. ఎన్నికల వాయిదా వేశారు. దీర్ఘకాలంగా చొరబాటు సమస్య పరిష్కారం కావాలి. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందాలు బలపడాలి. లేకపోతే మరిన్ని అల్లర్లు తప్పవు.
