Modi satyapaul: మోడీ, అమిత్ షాల పరువు తీసిన బీజేపీ గవర్నర్

Modi satyapaul:  మొత్తానికి ఒకే ఒక మాటతో ప్రధాని నరేంద్రమోడీ స్వభావం ఏంటో అర్థమైపోయింది. అదీ బీజేపీ గవర్నర్ స్వయంగా చెప్పడంతో ఇప్పుడు దుమారం రేగింది. మొదటి నుంచి నరేంద్రమోడీ పారిశ్రామికవేత్తలకు దగ్గరగా.. రైతులకు దూరంగా ఉంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పాలిత గవర్నర్ నోటి నుంచి జాలువారిన ఈ మాటలు చూస్తే అవి నిజమే అనక మానరు. బీజేపీ స్వయంగా ఏరికోరి మేఘాలయ రాష్ట్రానికి గవర్నర్ గా సత్యపాలిక్ ను చేసింది. ఈ మాజీ […]

Written By: NARESH, Updated On : January 4, 2022 7:03 pm
Follow us on

Modi satyapaul:  మొత్తానికి ఒకే ఒక మాటతో ప్రధాని నరేంద్రమోడీ స్వభావం ఏంటో అర్థమైపోయింది. అదీ బీజేపీ గవర్నర్ స్వయంగా చెప్పడంతో ఇప్పుడు దుమారం రేగింది. మొదటి నుంచి నరేంద్రమోడీ పారిశ్రామికవేత్తలకు దగ్గరగా.. రైతులకు దూరంగా ఉంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పాలిత గవర్నర్ నోటి నుంచి జాలువారిన ఈ మాటలు చూస్తే అవి నిజమే అనక మానరు.

malik-modi-shah

బీజేపీ స్వయంగా ఏరికోరి మేఘాలయ రాష్ట్రానికి గవర్నర్ గా సత్యపాలిక్ ను చేసింది. ఈ మాజీ బీజేపీ సీనియర్ నేత ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ బీజేపీ పరువు తీసేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

రద్దు చేసిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనపై చర్చించేందుకు వెళ్లిన సమయంలో ప్రధాని మోడీ చాలా అహంకారంగా మాట్లాడారని సత్యపాల్ వ్యాఖ్యానించారు. ‘రైతులు ఏమైనా నా కోసం చనిపోయారా?’ అని మోడీ ప్రశ్నించారని.. ఈ సమయంలో ప్రధానితో తాను కొద్దిసేపు యుద్ధమే చేశానని సత్యపాల్ మాలిక్ చెప్పుకొచ్చారు.

Also Read: దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కు కారణమైన సిరిని శ్రీహాన్ వదిలేశాడా?

హర్యానాలోని దాద్రిలో నిర్వహించిన కార్యక్రమంలో సత్యపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీని కలిసినప్పుడు మన రైతులు 500 మంది చనిపోయారని చెప్పానని.. ‘వాళ్లేమైనా నాకోసం చనిపోయారా?’ అని మోడీ అడిగారని.. చాలా అహంకారంగా మాట్లాడారని మాలిక్ హాట్ కామెంట్స్ చేశారు. చివరకు అమిత్ సాను కలవమని మోడీ చెబితే తాను కలిశానని వివరించారు.

‘‘సత్య మోడీకి మైండ్ పనిచేయట్లేదు.. మీరు నిర్లక్ష్యంగా ఉండండి.. మమ్మల్ని కలుస్తూ ఉండండి’ అని అమిత్ షా తనకు సర్దిచెప్పారని సత్యపాల్ చెప్పుకొచ్చారు.

కుక్క చనిపోతే మోడీ నివాళులు అర్పిస్తారని.. కానీ రైతులు చనిపోతే స్పందంచరా? అని సత్యపాల్ ఎద్దేవా చేశారు. రైతుల విషయంలో బీజేపీ నాయకత్వంపై గవర్నర్ సత్యపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మోడీ సర్కార్ ను కుదిపేస్తున్నాయి. సత్యపాల్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అతడు నా వ్యాఖ్యలు వక్రీకరించారని అన్నా కూడా బీజేపీ పెద్దలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Also Read: నాకు నచ్చలేదు జగన్ దిగిపోతావా? దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రాంగోపాల్ వర్మ