Virat Kohli: టీమిండియాకు కోహ్లి గుడ్ బై చెప్పనున్నాడా?

Virat Kohli: టీమిండియాకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ దూరం కావడంతో ప్రస్తుతం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న కోహ్లి ఆటపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. దీంతో అతడు ఆటకు టాటా చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులకు షాక్ తగిలినట్లు అయింది. మూడో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో […]

Written By: Srinivas, Updated On : January 4, 2022 12:34 pm
Follow us on

Virat Kohli: టీమిండియాకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ దూరం కావడంతో ప్రస్తుతం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న కోహ్లి ఆటపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. దీంతో అతడు ఆటకు టాటా చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులకు షాక్ తగిలినట్లు అయింది. మూడో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.

Virat Kohli

దక్షిణాఫ్రికాతో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కు కోహ్లి అందుబాటులో ఉండటం లేదని సమాచారం. దీంతో కోహ్లి వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడని వన్డేలకు ఇక గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అనుమతి కోరినట్లు సమాచారం. దీనికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.

Also Read: విరాట్ కోహ్లీకి ఏమైంది? రెండో టెస్టు నుంచి సడెన్ గా ఎందుకు తప్పుకున్నాడు?

దీంతో కోహ్లి సేవలు ఇక భారత జట్టుకు ఉండవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇకపై తన కుటుంబంతో గడిపేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు కోహ్లికి గాయం అయినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ కూడా కోహ్లి ప్రతిపాదనకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోకపోతే కేప్ టౌన్ వేదికగా జరిగే మూడో టెస్ట్ కు కూడా అందుబాటులో ఉండడనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే విరాట్ కోహ్లి పూర్తిగా భారత జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే కోహ్లి వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటాడనే వార్తలు హల్ చల్ చేశాయి. కానీ కోహ్లి అదంతా వట్టిదే అని చెప్పడంతో ఎవరు అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ ప్రస్తుతం అతడు వన్డే జట్టు నుంచి తప్పుకుంటున్న వస్తున్న వార్తలపై అభిమానులు కలత చెందుతున్నారు. మంచి ఆటగాడిని కోల్పోతున్నట్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: విరాట్ కోహ్లి బలం ఏమైంది? నిరాశ పరుస్తున్న ప్రదర్శన

Tags