https://oktelugu.com/

Radhe Shyam: రాధేశ్యామ్ మళ్లీ వాయిదా పడిందా.. డైరెక్టర్ ట్విట్‌కు అర్ధం అదేనా?

Radhe Shyam: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది అని మూవీ యూనిట్ ప్రకటించారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ బాగా గట్టిగానే తగిలింది. ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 4, 2022 / 12:51 PM IST
    Follow us on

    Radhe Shyam: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది అని మూవీ యూనిట్ ప్రకటించారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ బాగా గట్టిగానే తగిలింది.

    ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు, 50% ఆక్యుపెన్సీ, టికెట్ ధరలు అన్నీ దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా దారి పట్టాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించగా… ఇక అందరి చూపు ‘రాధేశ్యామ్’ పై పడింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ‘రాధేశ్యామ్’ మాత్రం జనవరి 14 న విడుదల ఖాయమంటూ మేకర్స్ చెప్తున్నా… అభిమానుల మనస్సులో మాత్రం వాయిదా పడింది అనే అనుమానం మాత్రం పోలేదు.

    ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. “సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా – మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి- టీమ్ రాధేశ్యామ్” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ త్వ్వెట్ తో డార్లింగ్ అభిమానులంతా సినిమా రిలీజ్ అవుతుందా, వాయిదా పడుతుందా అనే అయోమయంలో ఉన్నారు. ఇక ఈ విషయంపై మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు ఎదురు చూడడం తప్ప చేసేదేమి లేదని అంతా అనుకుంటున్నారు.