
Hyper Aadi : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పంచ్ లే కాదు పంచ సూత్రాలు కూడా చెబుతానని నిరూపిస్తున్నాడు. ఇటీవల ఆయన కవిత్వంతో కూడా కొన్ని వ్యాఖ్యలు వదలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో పవన్ కల్యాణ్ సభలో హైపర్ ఆది చేసిన ప్రసంగం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఏ కార్యక్రమంలోనైనా హైపర్ ఆది వస్తున్నాడంటే అక్కడున్న వాళ్లళ్లో జోష్ పెరుగుతోంది. తాజాగా ఆయన మెగాస్టార్ నుంచి రామ్ చరణ్ వరకు అందరినీ పొగిడీ పొగడకుండా చేసిన కామెంట్ష్ ఆకర్షించాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం మట్లాడారో చూద్దాం..

మెగా హీరో రామ్ చరణ్ ఇటీవల 38వ వసంతంలోకి అడుగుపెట్టారు. గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నాగబాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ గురించి మాట్లాడారు. చివరగా హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నారు. మెగా స్టార్ కుటుంబంలో పుట్టిన రామ్ చరణ్ ఎప్పటికీ నెంబర్ వన్ గానే ఉంటారన్నారు.
‘పదిమంది దండం పెట్టే చిరంజీవిలా..పదిమందికి అన్నంపెట్టే పవన్ కల్యాణ్ లా సాయం చేయడం రామ్ చరణ్ కు తెలుసు. తరాలు రావొచ్చు.. కొత్త హీరోలు రావొచ్చు. రికార్డులు క్రియేట్ చేయొచ్చు.. కానీ ఎప్పటికీ నెంబర్ వన్ గా ఉండేది చిరంజీవినే.. ఆయన కుమారుడు ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నారు.. పవన్ కల్యాణ్ జనాల్లో ఒకరు కాదు.. లెక్కలేనంత జనాభాకు ఒక్కరు. పదవికి ప్రలోభం కాని, నడుస్తున్న నాయకుడు పవన్ కల్యాణ్’ అని అన్నారు.
‘రామ్ చరణ్ తండ్రి పేరు నిలబెడుతారా? బాబాయ్ పేరు నిలబెడుతారా? అన్న వారికి నేను రామ్ చరణ్ సమాధానం ఏంటంటే.. నేను కుటుంబం కోసం పుట్టిన వాడిని కాను.. దేశానికి పేరు తేవడానికి జన్మించారు.. మెగా పవర్ స్టార్ అంటే లోకల్ కాదు.. గ్లోబల్’ అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ చప్పట్లతో జోష్ పెంచారు. కవిత్వంలా చెప్పిన ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.