పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను ఐక్యరాజ్య సమితిలో ఇండియా ప్రతినిధిగా ఫస్ట్ సెక్రటరీ స్నేహ దుబే ఘాటుగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని తేల్చిచెప్పారు. ఆమె వ్యాఖ్యలకు అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2012 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన స్నేహ దుబే గోవాలో స్కూల్ విద్య పూర్తి చేశారు. పుణెలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి ఉన్నత విద్య అభ్యసించారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంఫిల్ పూర్తి చేశారు.
12 ఏళ్ల వయసులోనే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ లో ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 2011లో సివిల్ సర్వీసెస్ రాసిన మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. అంతర్జాతీయ వ్యవహారాల గురించి నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఫారిన్ సర్వీసెస్ పై దృష్టి పెట్టి అనుకున్నది సాధించారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కావడం వల్లే తాను దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినట్లు ఆమె చెబుతోంది.
ప్రస్తుతం యూఎస్ లో ఇండియా ఫస్ట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే యూఎన్ సమావేశంలో ప్రధాని ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో స్నేహ దుబే వ్యాఖ్యలతో అందరిలో హర్షం వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్ కు ఘాటు సమాధానం చెప్పిన స్నేహ దుబే పేరు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో స్నేహ దుబే పాకిస్తాన్ పై చేసిన వ్యాఖ్యలతో సంచలనం కలిగింది. పాకిస్తాన్ కు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా దాని వక్ర బుద్ది మాత్రం మారదని తెలుస్తోంది. అందుకే ప్రతిసారి ఇండియాకు ఏదో ఒక రూపంలో అడ్డు తగలడం తిట్టు తినడం అలవాటే. ఈ నేపథ్యంలో స్నేహ దుబే చేసిన వ్యాఖ్యలతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. పాక్ పన్నాగాలను తిప్పికొట్టే అధికారి కావడంతో అందరు సంతోషిస్తున్నారు.