‘అనుష్క’ వివాహం పై వచ్చినన్ని రూమర్లు మరో హీరోయిన్ పై రాలేదు. గత పదిహేను సంవత్సరాలుగా అనుష్క పెళ్లి పై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సహజంగా ‘కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, కానీ స్టార్ హీరోయిన్ అనుష్కకు మాత్రం ఆ కళ్యాణ ఘడియలు ఎందుకు రావడం లేదో ? అసలు అనుష్క ఎందుకు పెళ్ళికి దూరంగా ఉంది ? అనుష్క – ప్రభాస్ మధ్య నిజంగానే ప్రేమ కథ నడుస్తోందా ? ఇలా సాగుతున్నాయి సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి పై కామెంట్స్.
మొత్తానికి అనుష్క పెళ్లికి ఉన్న డిమాండ్ ను గ్రహించిన ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ.. అనుష్క వివాహంపై కామెంట్స్ చేసి మొత్తమ్మీద నెట్టింట వైరల్ అయ్యాడు. అనుష్కకి వృత్తి పై అంకితభావం ఎక్కువ అని, అనుష్క ముఖ కవళికలను బట్టి చూస్తే.. ఆమె ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా, సినిమాలకు సంబంధం లేని బయటి వ్యక్తిని అనుష్క పెళ్లాడనుందని, 2023 లోపు అనుష్కకు వివాహం జరుగుతుందని కూడా పండిట్ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.
ఇక పనిలో పనిగా ఈ పండిట్ జగన్నాథ్ మరికొన్ని కామెంట్స్ చేస్తూ.. ‘అనుష్క చాలా డౌన్ టూ ఎర్త్, అనుష్కలో కొంచెం కూడా అహంభావం ఉండదు’ అంటూ తెలిపారు. ఇలా ఎవరు ఎన్ని రకాల కామెంట్స్ చేసినా అనుష్క మాత్రం తన వివాహం విషయంలో పెద్దగా స్పందన కూడా తెలియజేయడానికి ఆసక్తి చూపించట్లేదు.
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరో వస్తోన్న సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. అలాగే అనుష్క మరో లేడి ఓరియెంటెడ్ సినిమా చంద్రముఖి సీక్వెల్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది.
మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ న్యూస్ అయితే వైరల్ అయింది. ఏది ఏమైనా అనుష్క మాత్రం బాహుబలి సినిమాతో దేవసేనగా పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.