బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మొత్తానికి బిగ్ బాస్ మూడో వారం చివరికి చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ ని హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ లో 17 కంటెస్టెంట్స్ ఉన్నారు. మొదటి వారానికి గాను బూతులతో రెచ్చిపోయిన “సరయు” ఎలిమినేట్ కాగా, రెండో వారానికి గాను ఉమా దేవి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా మూడో వారం లో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.

ఇదిలా ఉండగా… బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కి ఏ చిన్న టాస్క్ ఇచ్చినా నువ్వానేనా అన్న రీతిలో పర్ఫామ్ చేస్తున్నారు. టైటిల్ ఎలాగైనా సాధించి తీరాలని కసితో ఆడుతున్నారు. అయితే గూగుల్ మాత్రం అప్పుడే ఈ సీజన్ విజేతను ప్రకటించేసింది. షో మొదలై కేవలం రెండు వారాలే అవుతున్నప్పటికీ సింగర్ శ్రీరామచంద్ర విన్నర్ అని డిక్లేర్ చేసింది. ఇది బుల్లితెర ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తోంది. శ్రీరామ్ అభిమానులు మాత్రం గూగుల్ ఈ విషయాన్ని ముందే పసిగట్టేసింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. గూగుల్‌లో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరని టైప్ చేయగా అది శ్రీరామచంద్ర పేరును సూచిస్తోంది. శ్రీరామ్ ప్లేబ్యాక్ సింగర్, నటుడు అని, అంతేకాకుండా ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేత కూడా అంటూ అతడి వివరాలను సైతం చూపిస్తుంది. ఇక ఇదే గూగుల్‌లో బిగ్‌బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరని టైప్ చేయగా ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తోంది.