https://oktelugu.com/

మీడియా టైకూన్ పతనం ప్రారంభమైందా?

ప్రముఖ మీడియా టైకూన్.. ఓ పార్టీకి రాజగురువు అయిన ఆ పెద్దాయన పని అయిపోయిందా? అన్ని వ్యాపారాలు నష్టాల్లో మునుగుతున్నాయా? కరోనా దెబ్బకు కుదేలైన మీడియా రంగంలో ఆయన చేతిలో ఉన్న మీడియాకు కూడా భారీ దెబ్బనే తగిలింది. ఇప్పటికే ఉద్యోగులను కర్రవిరగకుండా పాముచచ్చేలా సాగనంపిన ఆయన ఇప్పుడు మరో వ్యాపారాన్ని కూడా వదిలేసి చేతులెత్తేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. Also Read: మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. జగన్ సర్కార్ కు షాక్..! […]

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2020 / 03:41 PM IST
    Follow us on


    ప్రముఖ మీడియా టైకూన్.. ఓ పార్టీకి రాజగురువు అయిన ఆ పెద్దాయన పని అయిపోయిందా? అన్ని వ్యాపారాలు నష్టాల్లో మునుగుతున్నాయా? కరోనా దెబ్బకు కుదేలైన మీడియా రంగంలో ఆయన చేతిలో ఉన్న మీడియాకు కూడా భారీ దెబ్బనే తగిలింది. ఇప్పటికే ఉద్యోగులను కర్రవిరగకుండా పాముచచ్చేలా సాగనంపిన ఆయన ఇప్పుడు మరో వ్యాపారాన్ని కూడా వదిలేసి చేతులెత్తేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. జగన్ సర్కార్ కు షాక్..!

    ప్రముఖ మీడియా టైకూన్ ఆయన ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఏకంగా సీఎంలను మార్చేసిన ఘనత ఆయన సొంతం. అలాంటి ఆయనను కరోనా షేక్ చేసిందని చెప్పవచ్చు. ఈ మధ్య 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయనేత వచ్చి కలిసినా ఈ పెద్దమనిషి వ్యాపార ఫస్ట్రేషన్ లో సరిగా మాట్లాడలేకపోయాడట..

    చాలా అభిరుచి, ఆసక్తితో ప్రారంభించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం అంతా ఇప్పుడు ఒక్కటొక్కటిగా కూలుతుంటే తీవ్ర డిప్రెషన్ లోకి జారిపోయినట్టు తెలిసింది. సదురు పెద్ద మనిషి వ్యాపారాల్లో లాభాలు వస్తే విస్తరిస్తాడు. నష్టాలు వస్తే మాత్రం వెంటనే ఎక్కువ సమయం వాటిపై ఖర్చు చేయకుండా ఉన్న ఫళంగా మూసివేస్తాడు.

    1980లోనే నేటి యాపీ, మజా లాంటి ఫ్రూట్ డ్రింక్ ను సదరు మీడియా టైకూన్ లాంచ్ చేశాడు. కానీ నాడు దీనికి ఆదరణ లేకపోవడంతో వెంటనే కంపెనీని మూసివేశాడు. ఇక తెలుగు మీడియాలో నంబర్ 1గా ఉన్న ఆయన అప్పట్లో ఇంగ్లీష్ దినపత్రికను తీసుకొచ్చి చేతులు కాల్చుకున్నాడు. దేశంలోని దిగ్గజ పాత్రికేయులను తీసుకొచ్చి నష్టాల పాలు కావడంతో వారందరినీ తీసేశాడు.

    Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..

    ఇప్పుడు ఆయన గతంలో ప్రారంభించిన సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని మూసివేశాడని సమాచారం అందుతోంది.ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు పంపిణీ చేసిన సంస్థను ఇప్పుుడు మూసివేశాడట.. భారీ మౌలిక సదుపాయలుండి.. థియేటర్లను లీజుకు తీసుకున్న సదురు మీడియా టైకూన్ ఇప్పుడు పూర్తిగా ఆ బిజినెస్ కు స్వస్తి పలికాడని చెబుతున్నారు.

    ఇక ఇప్పటికే సినిమాల నిర్మాణ రంగాన్ని నిలిపివేసిన పెద్దమనిషి.. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో.. అసలు రిలీజ్ అవుతాయో లేదోనన్న సందేహంతో డిస్ట్రిబ్యూషన్ ను వదిలేయడంతో సినీ రంగం నుంచి పూర్తిగా పక్కకు తొలిగినట్టే కనిపిస్తోంది.