https://oktelugu.com/

ఇండస్ట్రీపై కరోనా పంజా.. ఎస్పీ బాలుకు పాజిటివ్

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాణాంతక మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలనే కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులపై పంజా విసురుతోంది. అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా తెలుగు సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు ఎస్‌ఎస్‌ రాజమౌళి, తేజ కరోనా బారిన పడ్డారు. తాజాగా గాన గాంధర్వుడు, ప్రముఖ సింగర్ ఎస్పీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 4:02 pm
    Follow us on


    దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాణాంతక మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలనే కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులపై పంజా విసురుతోంది. అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా తెలుగు సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు ఎస్‌ఎస్‌ రాజమౌళి, తేజ కరోనా బారిన పడ్డారు. తాజాగా గాన గాంధర్వుడు, ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఇండస్ట్రీ మరోసారి ఉలిక్కిపడింది. మంగళవారమే ఫిమేల్ సింగర్ స్మిత, ఆమె భర్తకు పాజిటివ్‌ అని నిర్ధారణ కాగా ఇప్పుడు బాలుకు కూడా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని బాలునే వెల్లడించారు.

    Also Read: తెలుగు డైరెక్టర్ తో మరో బాలీవుడ్ స్టార్ !

    తనకు కోవిడ్19 పాజిటివ్‌ అని తేలిందని బుధవారం ఫేస్‌బుక్లో వీడియో పోస్టు చేశారు. గత మూడు రోజులుగా కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌గా తేలిందన్నారు. మెడిసిన్ ఇచ్చి హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని చెప్పారు. కానీ, కుటుంబసభ్యలుకు ఇబ్బంది కలగకూడదని భావించి హాస్పిటల్‌లో చేరినట్లు తెలిపారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఏ ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జ్వరం తగ్గిందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ అయి ఆరోగ్యంగా ఇంటికి వెళ్తానని బాలు ధీమా వ్యక్తం చేశారు. తమ అభిమాన గాయకుడు కరోనా బారిన విషయాన్ని తెలుసుకొని అభిమానులు కంగారు పడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండడం.. వీడియో ద్వారా స్వయంగా ముందుకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

    Also Read: సినిమా పోకడ ఏమైపోతుందో.. !

    కాగా, పాప్‌ సింగర్ స్మిత తనకు కరోనా సోకిందని మంగళవారం వెల్లడించింది. తన భర్త శశాంక్‌ కూడా పాజిటివ్ అని తేలిందని చెప్పింది. మరోవైపు రాజమౌళి కుటుంబం హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా బారిన పడిన వాళ్లలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌, టీవీ నటులు నవ్య స్వామి, రవికృష్ణ, భరద్వాజ్‌, సాక్షి శివ తదితరులు మహమ్మారిని జయించారు. కానీ, టాలీవుడ్‌ నిర్మాత, ఈతరం ఫిలిమ్స్‌ సమర్పకుడు పోకూరి రామారావు (64) మాత్రం కరోనా సోకి కన్నుమూశారు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో కరోనాను జయించలేకపోయారు.