ఏపీ సీఎం జగన్ గెలుపు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాగే తనకు సహకరించిన కేసీఆర్ కు స్వయంగా వచ్చి మరీ కృతజ్ఞతలు తెలిపారు జగన్. ఈ జోడీ అన్నాదమ్ముల వలే కలిసిపోయి సాగడం తెలుగు రాష్ట్రాల్లో సహృద్భావ వాతావరణాన్ని సృష్టించింది.
Also Read: మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. జగన్ సర్కార్ కు షాక్..!
ఇదేకాదు.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలు.. నదీజలాలు, సచివాలయ భవనాల అప్పగింత విషయంలో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య అంగీకారం కుదిరింది. ప్రస్తుతం కూల్చివేస్తున్న సచివాలయ ప్రాంగణంలో ఏపీకి కేటాయించిన భవనాలను జగన్ సర్కార్ కేసీఆర్ కు అప్పగించి సహకరించింది.
అయితే తాజాగా నదీజలాల వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి తెరమీదకి వచ్చాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడంతో వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను కోరింది.
ఎంత అన్నాదమ్ములైనా సరే నదీ జలాలు.. తెలంగాణ అస్తిత్వం విషయం వచ్చేసరికి కేసీఆర్ వెనక్కితగ్గడం లేదు.అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వైఖరుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. సీమ ప్రజల కోసం తెలంగాణతో ఫైట్ కు జగన్ వెనుకాడడం లేదు.
Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే దక్షిణ తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతుంది. నాగార్జున సాగర్ లోకి చుక్క నీరు రాక నల్లగొండ, మహబూబ్ నగర్ తోపాటు ఖమ్మం జిల్లాలకు తీవ్రనష్టం. సాగర్ కింద దాదాపు 25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అందుకే కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గకుండా ఆంధ్రతో ఫైట్ కు రెడీ అయ్యారు. ఇక కృష్ణ నదిలో తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామంటూ జగన్ సైతం రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టుముట్టడంతో ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి అగ్గిరాజేస్తోంది. నదీజలాల విషయంలో ఇచ్చిపుచ్చుకునేలా సామరస్యంగా వెళదామనుకున్న సీఎం జగన్, కేసీఆర్ లు ఇప్పుడు సుప్రీం కోర్టుల వరకు వెళ్లడం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పెంచుతోంది.