
మన పెద్దలు అవతలి వాళ్ల సమస్యలు మనకు సులభంగా కనిపిస్తాయని… అదే సమస్యను మనం ఫేస్ చెయాల్సి వస్తే తప్ప ఆ సమస్యలోని లోతెంతో అర్థం కాదని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు ఈ సామెత సరిగ్గా సూట్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు రాజ్యసభలో మాట్లాడుతూ ఏపీ హైకోర్టు మీడియా స్వేచ్ఛను హరిస్తోందని చెప్పారు.
Also Read : ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి మరో ఎమ్మెల్యే
విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తున్న జగన్ సర్కార్ మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మీడియాపై ఆంక్షలు విధిస్తున్న జగన్ సర్కార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం నవ్వు తెప్పిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే చాలు జగన్ సర్కార్ నోటీసులు పంపడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం మీడియాతో వ్యవహరించని విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. యాడ్ల విషయంలో కూడా జగన్ సర్కార్ సొంత పత్రికల విషయంలో ఒకలా ఇతర పత్రికల విషయంలో వ్యవహరించిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అలాంటి జగన్ సర్కార్ ఇప్పుడు మీడియా గురించి చేసిన వ్యాఖ్యలు జర్నలిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న వైసీపీ … సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే వేధింపులకు గురి చేస్తున్న వైసీపీ ఇప్పుడు మాత్రం నీతులు చెబుతూ ఉండటం గమనార్హం. సోషల్ మీడియా, వెబ్ మీడియా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉతికారేస్తూ ఉండటం గమనార్హం.
Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?