తెలంగాణలో నేతల స్ఫూర్తి.. ఏపీలో ఊహించగలమా?

రాజకీయాల్లో సవాళ్లు విసరడం సర్వసాధారణం. కానీ చాలా అరుదుగా రాజకీయ నాయకులు సవాలును స్వీకరించి రంగంలోకి దిగే ధైర్యం చేస్తారు. ఈ అరుదైన విషయం తెలంగాణలో చోటుచేసుకుంది. నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకుల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ హౌస్ పథకంపై మాటల యుద్ధం జరిగింది. Also Read: విమోచనాన్ని టీఆర్ఎస్‌ ఎందుకు పక్కన పెట్టినట్లు? తెలంగాణ సర్కార్ ఎన్నికల వేళ 2 లక్షల డబుల్ బెడ్ రూం […]

Written By: NARESH, Updated On : September 17, 2020 7:29 pm
Follow us on

రాజకీయాల్లో సవాళ్లు విసరడం సర్వసాధారణం. కానీ చాలా అరుదుగా రాజకీయ నాయకులు సవాలును స్వీకరించి రంగంలోకి దిగే ధైర్యం చేస్తారు. ఈ అరుదైన విషయం తెలంగాణలో చోటుచేసుకుంది. నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకుల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ హౌస్ పథకంపై మాటల యుద్ధం జరిగింది.

Also Read: విమోచనాన్ని టీఆర్ఎస్‌ ఎందుకు పక్కన పెట్టినట్లు?

తెలంగాణ సర్కార్ ఎన్నికల వేళ 2 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తానని మాట ఇచ్చిందని.. నిర్మించిన డబుల్ బెడ్ రూంలను చూపించమని కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్కా టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సవాలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే అధికార పార్టీ ఈ రకమైన వాదనలు చేస్తోందని ఆరోపించాడు.

భట్టి విసిరిన సవాలును టిఆర్ఎస్ మంత్రి తలసాని స్వీకరించారు. స్వయంగా భట్టి ఇంటికి ఉదయం మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. మంత్రి తన కారులోనే భట్టిని వెంట పెట్టుకొని ఇళ్ల నిర్మాణాల పరిశీలనకు తీసుకెళ్లారు. మొదట జియాగూడలోని ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత భట్టి మరియు తలసాని ఇద్దరూ హైదరాబాద్ లో నిర్మాణం అవుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించారు.

వారి పర్యటన తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు మేము 3500 ఇళ్లను తనిఖీ చేశామని, సమయం సరిపోకపోవడంతో రేపు మరికొన్ని ఇళ్లను పరిశీలిస్తామని భట్టి తెలిపారు. నిర్మాణంలో నాణ్యత .. పరిమాణం గురించి మీడియా అడిగినప్పుడు భట్టి ఆసక్తికరంగా స్పందించారు. తాను ఇంజనీరింగ్‌లో నిపుణుడిని కాదని, అందువల్ల ఒక బృందాన్ని నియమించామని, వారు దీనిని విశ్లేషిస్తారని సమాధానం ఇచ్చారు. నివేదిక వచ్చిన తర్వాత అన్ని వాస్తవాలతో దీనిపై మాట్లాడుతామని భట్టి అన్నారు.

Also Read: చరిత్ర దాచిన తెలంగాణ ‘సాయుధ పోరాటం’!

భట్టి మాట్లాడిన అనంతరం మంత్రి తలసాని మాట్లాడారు.. “ఈ ప్రాజెక్ట్ సిఎం కేసీఆర్ కల. అంతకుముందు రాజీవ్ స్వాగృహ పథకంలో పేదలు 30 శాతం, మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో బ్యాంకులోన్ గా ఇచ్చేవారు. అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టి ఇస్తోంది. ఒక్క రూపాయి కూడా పేదల నుంచి తీసుకోవడం లేదు”అని తలసాని అన్నారు. “ఇళ్ళు నిర్మించడమే కాదు, ఈ గృహాల చుట్టూ ఉన్న మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నాము. మా యువ నాయకుడు కెటిఆర్ ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గడువులోపు ఇళ్లను నిర్మించి రాబోయే రోజుల్లో మరింత మంది పేదలకు ఇళ్లు కట్టి ఇస్తాం. ” అని తలసాని అన్నారు.

తెలంగాణ, ఏపీలో ఇలా ఒక సమస్యపై ఇప్పటిదాకా రెండు పక్షాలు కలిసిన దాఖలాలు లేవు. ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటై మరీ ఇలా చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.తలసాని చొరవను అందరూ అభినందిస్తున్నారు.  నిప్పులు చెరిగే రాజకీయం నడుస్తున్న ఏపీలో ఇలాంటి దృశ్యాలు అస్సలు కనిపించవంటే అతిశయోక్తి కాదేమో..