
తన పదవీకాలంలో వర్షాలు రాకూడదని దేవుడ్ని మొక్కుకుంటాను అంటూ హైదరాబాద్ నగర నూతన మేయర్ విజయలక్ష్మి అన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై మేయర్ విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. వర్షాల అంశంలో తాను వెల్లడించిన అభిప్రాయాలను వక్రీకరించారని ఆరోపించారు.
Also Read: కేసీఆర్ కు టాలీవుడ్ స్టార్స్.. భారీ గిఫ్ట్..
వందేళ్లలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయని, ఆ స్థాయిలో వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడ్ని కోరుకున్నానే తప్ప, అసలు హైదరాబాదులో వర్షాలే పడకూడదని తాను మొక్కుకోలేదని వివరణ ఇచ్చారు. ఆ విధంగా జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని విజయలక్ష్మి అన్నారు. తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. అలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపారు.
Also Read: రేవంత్ రెడ్డి పాదయాత్ర సీనియర్లకు నచ్చడం లేదా..? అందుకే అలా చేశారా..?
అటు, షేక్ పేట తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో తన పాత్ర ఉందన్న ఆరోపణలపైనా ఆమె వివరణ ఇచ్చారు. తహసీల్దార్ బదిలీ వ్యవహారం రెవెన్యూ విభాగానికి సంబంధించినదని, అది తన పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు. తనపై రాజకీయ ఒత్తిళ్లు ఏమీ లేవని తహసీల్దార్ కూడా చెప్పారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా గెలిచిన గద్వాల విజయలక్ష్మి ఇటీవలే మేయర్‌గా ఎన్నికయ్యారు. విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె అని తెలిసిందే.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
జీహెచ్‌ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికై వారం రోజులు కూడా గడవకముందే ఆమెను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. వీటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇంటర్వ్యూలో విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షాలు రావొద్దని కోరుకుంటున్నానని చెప్పారు. దీంతో నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విమర్శలు గుప్పించారు. అసలు వర్షాలు రావద్దని కోరుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆమె మాట్లాడిన వీడియోను వైరల్‌గా మార్చారు. ఆ వీడియోపై నెటిజన్లు సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. అందుకే.. ఎట్టకేలకు ఆమె తన వ్యాఖ్యలపై ఓ క్లారిటీ ఇచ్చారు.
Comments are closed.