
నక్సలిజం నేపథ్యంలో టాలీవుడ్ లో వస్తున్న చిత్రాలు చిరంజీవి ఆచార్య, రానా ‘విరాఠపర్వం’. ఈ రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేశాయి. ఇప్పుడు విడుదలకు సన్నద్ధమవుతున్న వేళ ‘విరాఠపర్వం’ లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట..
రెండు సినిమాల్లో ఒకటే కథ అని.. దగ్గర పోలికలు ఉన్నాయని.. సీన్లు దాదాపుగా ఒకేటేనని టాక్. దీంతో విరాటపర్వం యూనిట్ పునరాలోచనలో పడిపోయి సినిమా కథను మార్చడమా? విడుదల ఆలస్యం చేయడమా అన్నది ఆలోచిస్తోందట..
దీంతో ఈ క్రమంలోనే ఏప్రిల్ 30కి రావాల్సిన విరాటపర్వం మూవీని ఆపితే వెంకటేశ్ నారప్పను అదే రోజు రిలీజ్ చేయనున్నారు. నారప్ప మే 7న రావాల్సి ఉన్నా ముందుకు జరుపుతున్నారు. ఇక విరాటపర్వం మార్చితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పడం కష్టం..
చిరంజీవి ఆచార్య మాత్రం చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30న నాగశౌర్య ‘లక్ష్య’ణు కూడా వాయిదా వేస్తున్నారని తెలిసింది.