https://oktelugu.com/

వరదసాయం పంపిణీలో భారీ కుంభకోణం: రేవంత్‌రెడ్డి

హైదారాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టించింది. పలువురు నగరవాసులు మృతి చెందారు. కొన్ని కాలనీల్లో తీవ్ర నష్టం సంభవించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం కింద ప్రతి ఒక్కరికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని సీఎం పిలుపునివ్వడంతో పలు స్వచ్ఛంద సంస్థలు, సినీ యాక్టర్లు భారీగా విరాళాలు అందించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సైతం వరద పరిస్థితిని సమీక్షించి సర్వే చేసింది. మరిన్ని తెలంగాణ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 09:24 AM IST
    Follow us on

    హైదారాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టించింది. పలువురు నగరవాసులు మృతి చెందారు. కొన్ని కాలనీల్లో తీవ్ర నష్టం సంభవించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం కింద ప్రతి ఒక్కరికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని సీఎం పిలుపునివ్వడంతో పలు స్వచ్ఛంద సంస్థలు, సినీ యాక్టర్లు భారీగా విరాళాలు అందించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సైతం వరద పరిస్థితిని సమీక్షించి సర్వే చేసింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    అయితే వరద సాయం పంపిణీలో అవకతవకలు జరిగాయి. అసలైన లబ్ధిదారులకు సాయం అందలేదు. అందినవారికి సగమే డబ్బులు వచ్చాయి. సీఎం ప్రతి ఒక్కరికి రూ. 10వేలు అని చెబితే రూ.5వేలు మాత్రమే ఇచ్చారని బాధితులు ఆరోపించారు. కొందరు ఆందోళనలు కూడా చేశారు. దీంతో ప్రభుత్వం వరదసాయాన్ని మొత్తానికే పంపిణిని నిలిపివేసింది.

    Also Read: బండి సంజయ్ కోసం ఒంటికి నిప్పంటించుకున్న కార్యకర్త మృతి

    ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో రూ. 400 కోట్లు వరదసాయం పంపిణీ చేశారని అధికారులు పేర్కొంటున్నారని, అవేంటో చూపించాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలో గ్రేటర్‌ జోనల్‌ మున్సిపల్‌ కమిషనర్లను రోజుకొకరి చొప్పున కలిసి ఆయన అవినీతిపై విచారణకు డిమాండ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్‌ జోనల్‌ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందిచారు.

    Also Read: ‘బురద’లో దిగబడిన కారు.. హైదరాబాద్ లో బయటపడుతుందా?

    ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ముంపు బాధితుల పేరుతో భారీ దోపిడీ జరిగిందని దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏ పథకం సాయం అయినా నేరుగా లబ్ధిదారుల బ్యాంకుల్లో నేరుగా వేయాలి గాని.. ప్రభుత్వం ప్రజల చేతికి ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భారీ అవినీతి చోటు చేసుకుందన్నారు. ఈ దోడిపీపై విజిలెన్స్‌, ఏసీబీ విచారణ చేయాలని పట్టుబడుతున్నాడు. ఇప్పటి వరకు రూ.400 కోట్లు పంపిణీ చేశారని చెబుతున్నారని, అంత నగదు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.