https://oktelugu.com/

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పసుపు పార్టీ కనిపిస్తుందా..?

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పసుపు జెండాలతో రెపరెపలాడిన టీడీపీ ఇప్పుడు ఆ జెండా మచ్చుకైనా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే టీడీపీకి శాపంగా మారి అప్పటి నుంచి పార్టీ మనుగడ కొంచెం కొంచెం కుచించుకుపోయింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో సైకిల్‌ పార్టీకి కనీసం కార్యకర్తలు కూడా కరువయ్యారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థలు.. ఇలా ఏ ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదు. మరిన్ని తెలంగాణ రాజకీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 09:26 AM IST
    Follow us on

    ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పసుపు జెండాలతో రెపరెపలాడిన టీడీపీ ఇప్పుడు ఆ జెండా మచ్చుకైనా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే టీడీపీకి శాపంగా మారి అప్పటి నుంచి పార్టీ మనుగడ కొంచెం కొంచెం కుచించుకుపోయింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో సైకిల్‌ పార్టీకి కనీసం కార్యకర్తలు కూడా కరువయ్యారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థలు.. ఇలా ఏ ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    త్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా గ్రేటర్‌ పరిధిలో చాలా సీట్లలో టీడీపీ జెండా ఎగిరింది. అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో  ఒక్క నాయకుడు కూడా టీడీపీకి అందుబాటులో లేడు.

    Also Read: వరదసాయం పంపిణీలో భారీ కుంభకోణం: రేవంత్‌రెడ్డి

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పలు స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసింది. శేర్‌లింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, జూబ్లిహిల్స్‌, కంటోన్మెంట్‌, రాజేంద్రనగర్‌, మహేశ్‌వరం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచారు. అయితే ఆ తరువాత 2019 ఎన్నికలు జరిగే ముందే వీరంతా టీఆర్‌ఎస్‌లోకి మారిపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఓకే ఒక్క సీటు కతుత్బుల్లాపూర్‌. ఆ తరువాత ఆ ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.
    తెలంగాణలో చివగా భారీ ఎత్తున జరిగి ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులు కరువవడంతో టీడీపీ పోటీ కూడా చేయలేదు. ఇప్పుడు త్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కిందిస్థాయి కార్యకర్తలు సహా టీఆర్‌ఎస్‌, బీజేపీలోకి చేరారు. అక్కడో, ఇక్కడో ఉన్న నాయకులు కూడా త్వరలో టీఆర్‌ఎస్‌ లేదా, బీజేపీకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.

    Also Read: బండి సంజయ్ కోసం ఒంటికి నిప్పంటించుకున్న కార్యకర్త మృతి

    ఇందులో భాగంగా టీడీపీలో ప్రముఖంగా ఉన్న టీటీడీపీ నాయకుడు గంగాధర్‌గౌడ్‌ కూడా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట ఆయన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని కలిసి చర్చలు జరిపారు. ఈనెల 8న జరగనున్న కార్యక్రమంలో పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. దీంతో ఇక టీడీపీ దుకాణం బంద్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.