ఈటల, రఘురామ.. ఒక్కటేనా వైసీపీ?

రాజకీయ నాయకులకు తెలివి ఉండదంటారు. వారు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియక తికమక పడుతుంటారు. రాజమండ్రి ఎంపీ, వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతను భరత్ నెరవేర్చారు. ఇక నిర్ణయం లోక్ సభ స్పీకర్ చేతిలో ఉంది. భరత్ మీడియాతో మాట్లాడుతూ రఘురామ కృష్ణంరాజుకు పౌరుషం ఉంటే ఈటల […]

Written By: Srinivas, Updated On : June 15, 2021 6:08 pm
Follow us on

రాజకీయ నాయకులకు తెలివి ఉండదంటారు. వారు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియక తికమక పడుతుంటారు. రాజమండ్రి ఎంపీ, వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతను భరత్ నెరవేర్చారు. ఇక నిర్ణయం లోక్ సభ స్పీకర్ చేతిలో ఉంది.

భరత్ మీడియాతో మాట్లాడుతూ రఘురామ కృష్ణంరాజుకు పౌరుషం ఉంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామపై అనర్హత వేటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పౌరుషమే ఉంటే డిమాండ్ చేసే వరకు రఘురామ పదవిని అంటిపెట్టుకుని ఉంటారా? పౌరుషానికి రఘురామకు ఏంటి సంబంధం? వైసీపీ తెలివితక్కువ తనంతోనే రఘురామ రెచ్చిపోతున్నారని తెలుస్తోంది.

ఈటలంటే నైతిక విలువలు కలిగిన నేత. మాట మీద నిలబడే తత్వం ఆయనది. మాటంటే పడని మనస్తత్వం కావడంతో పార్టీలో ఇమడలేక బయటకొచ్చిన నేత రాజేందర్. అలాంటి ఆయనతో ముడిపెట్టడంలో వైసీపీ ఆంతర్యమేమిటో ఆర్థం కావడం లేదు. దీంతో భరత్ అమాయకత్వానికి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆత్మ గౌరవమే ఆయుధంగా మెలిగే ఈటలపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈటలపై కోపం ఉంటే ఏదో రకంగా తీర్చుకోవాలే కాని ఇలా ఎవరితో పడితే వారితో పోల్చడం భావ్యం కాదు. మూడు దశాబ్దాలుగా సంపాదించుకున్న ఇమేజ్ ను తగ్గించడం కాదా? అనే నిలదీతలు దేనికి సంకేతం? ఏది ఏమైనా మార్గాని భరత్ డిమాండ్ ఆయన అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పొచ్చు.