తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీ బలపడేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. తెలంగాణ అవతరించిన తరువాత నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిణామాల్లో చాలా తేడా ఉంటోంది. మరోవైపు కాంగ్రెస్ బలహీనపడడం చూస్తుంటే బీజేపీ బలం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల సైతం తెలంగాణలో పట్టుకోసం పాకులాడుతున్నారు. తాను ఎవరు వదిలిన బాణాన్ని కాదని చెబుతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికతో బీసీ ఓటర్లను తమ వైపు తప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకుంటాయని కవిత చెబుతున్నారు.
భవిష్యత్ రాజకీయాలపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ముఖచిత్రం మారడం ఖాయంగా కనిపిస్తోంది. అది ఎవరికి ప్రయోజనకారిగా ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు. తెలంగాణలో అధికారం ఎవరి హస్తగతం అవుతుందో కాలమే నిర్ణయించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి విజయం సాధిస్తుందోనని చెప్పడం కష్టమే.