https://oktelugu.com/

బీజాపూర్ లో జవాన్లపై మావోయిస్టుల దారుణాలు

బుల్లెట్లు తగిలి కదల్లేని స్థితిలో ఉన్న వారిని ఎవరైనా అయితే చంపేస్తారు? లేదంటే వదిలేసి వెళ్లిపోతారు. కానీ.. చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ అడవిలో జవాన్ల విషయంలో మావోయిస్టులు దారుణానికి పాల్పడట్టు వెలుగుచూసింది. బుల్లెట్ దెబ్బలు తగిలి కదల్లేని దీన స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జవాను చేయి నరికి పాశవికంగా మావోయిస్టులు హత్య చేశారు. అంతేకాదు.. బుల్లెట్ గాయాలు తగిలి కొందరు సైనికులు బతికేవారని.. కానీ గంటల తరబడి వారు అలాగే ఉండడంతో తిండి, నీరు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 4, 2021 / 06:22 PM IST
    Follow us on

    బుల్లెట్లు తగిలి కదల్లేని స్థితిలో ఉన్న వారిని ఎవరైనా అయితే చంపేస్తారు? లేదంటే వదిలేసి వెళ్లిపోతారు. కానీ.. చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ అడవిలో జవాన్ల విషయంలో మావోయిస్టులు దారుణానికి పాల్పడట్టు వెలుగుచూసింది. బుల్లెట్ దెబ్బలు తగిలి కదల్లేని దీన స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జవాను చేయి నరికి పాశవికంగా మావోయిస్టులు హత్య చేశారు.

    అంతేకాదు.. బుల్లెట్ గాయాలు తగిలి కొందరు సైనికులు బతికేవారని.. కానీ గంటల తరబడి వారు అలాగే ఉండడంతో తిండి, నీరు లేక డీహైడ్రేషన్ కు గురై మృతిచెందినట్లు పోస్టుమార్టం తేలింది. ఇతర జవాన్లు కూడా మావోయిస్టులతో పోరులో వారిని ఎదుర్కోలేక నిస్సహాయులుగా వెనుదిరిగినట్లు తేలింది.

    ఈ విషయాలు తెలిసి జవాన్లపై మావోయిస్టులు దారుణంగా వ్యవహరించారని.. చచ్చేదాకా హింసించారని తేలింది. ఇవి అందరినీ కలిచివేస్తోంది.ప్రాణాలతో లభించిన జవాన్లను నక్సలైట్లు చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు తేలింది. మరికొంత మంది దీన స్థితిలో మరణించినట్లు తేలింది.

    మృతిచెందిన కొందరు జవాన్ల వద్ద లభించిన ఆయుధాలు, తుపాకులు, బులెట్ ఫ్రూఫ్ జాకెట్లు, బూట్లతో నక్సల్స్ పరారయ్యారని తెలిసింది. ఈ దారుణాలను తెలిసి ఇప్పుడు నక్సలైట్లపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక అదృశ్యమైన మిగతా జవాన్ల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.

    చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ అడవిలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన జవాన్ల సంఖ్య 24కు చేరింది. 30 మందికి పైగా గాయపడ్డారు. మరికొంత మంది ఆచూకీ గల్లంతైంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.